27.7 C
Hyderabad
April 25, 2024 09: 26 AM
Slider సంపాదకీయం

కొన ఊపిరితో ఉన్న సినిమా గొంతు నొక్కేశారు….

#VEPIQ

ఆసియాలోనే అతి పెద్ద స్క్రీన్ ఉన్న థియేటర్….. గోల్డెన్ జూబ్లీ జరుపుకున్న సినిమా టాకీస్….. ఇలా ఒకటి కాదు….. అన్నీ మూతపడిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. సినిమా థియేటర్లపై కక్షగట్టినట్లు అధికారులు చేస్తున్న దాడులతో థియేటర్ యజమానులు బెంబేలెత్తుతున్నారు. సినిమా టిక్కెట్ రేట్లపై పట్టుపట్టి కూర్చున్న వై ఎస్ జగన్ ప్రభుత్వం, ఏది ఏమైనా తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అంటున్నది.

సినీ పరిశ్రమ నుంచి వసూలయ్యే పన్నులను పణంగా పెట్టి మరీ దాడులు కొనసాగిస్తున్నారు. సినీ ధియేటర్లు మూతపడిపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను రాబడి తగ్గుతుంది. వినోదపు పన్ను చట్ట ప్రకారం అయితే స్థానిక సంస్థలకు రావాల్సి ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ పన్ను రాబడి స్థానిక సంస్థలకు ఇవ్వకుండా తన ఖజానాలో వేసుకోవడం కొత్త కాదు కానీ ఇప్పుడు అసలుకే మోసం వచ్చేస్తున్నది. తెలుగు సినిమాలో చక్రం తిప్పే కొన్ని కుటుంబాలను టార్గెట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమనే నాశనం చేస్తున్నారు. సినిమా టిక్కెట్ల రేట్లను నియంత్రించే పేరుతో రకరకాలుగా వేధింపులు మొదలు పెట్టారు. మూవీ మొఘల్ రామామానాయుడి వారసుడు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఇప్పటికే తనకు ఉన్న సినిమా ధియేటర్లలో 80 శాతం మూసివేసినట్లు ప్రకటించారు.

ఇక తాను సినిమాలు తీయనని, తీసినా ధియేటర్లలో విడుదల చేయనని ఆయన ప్రకటించారు. ఓటీటీలోనే సినిమాలు విడుదల చేయాలని సురేష్ బాబు నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరుజిల్లా సూళ్ళూరుపేటలో ఆసియాలోనే అతి పెద్ద స్క్రీన్ కలిగి ఉన్న U V EPIQ థియేటర్ ఉంది. అది నేడు మూతపడింది. టిక్కెట్ రేట్లు తమకు ఏ మాత్రం గిట్టుబాటు కాదని వారు తేల్చి చెప్పారు.

ఇలా ఒక్కటి కాదు…. చాలా ధియేటర్లు మూతపడ్డాయి. కరోనా కారణంగా దేశంలోని అన్ని సినిమా హాళ్లూ మూతపడ్డాయి. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. లాక్ డౌన్ సమయంలో తమకు నష్టం వాటిల్లినందున రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని థియేటర్ యజమానులు కోరారు. విద్యుత్ చార్జీలు రద్దు చేస్తామని జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

అంతే కాకుండా సినిమా హాల్ ను బట్టి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకూ రుణాలు ఇస్తామని కూడా ఒప్పుకున్నది. దాంతో చాలా చోట్ల థియేటర్లు తెరిచేందుకు సన్నాహాలు చేశారు. జగన్  ప్రభుత్వం ఇచ్చిన హామీలు చూసి ఆనందంతో పులకించిపోయిన థియేటర్ యజమానులకు అసలుకు మోసం వచ్చే విధంగా ఇప్పుడు జరుగుతున్నది.

థియేటర్ ను బతికించడం అనే చారిత్రక అవసరం అటుంచి థియేటర్ ను చంపడం అనే కాన్సెప్టుకు జగన్ ప్రభుత్వం ఎందుకు వచ్చిందో ఎవరికి అర్ధం కావడం లేదు. పైరసీ నుంచి, ఓటిటి నుంచి విపరీతమైన పోటీ ఎదుర్కొంటున్న సినిమాను ఆదుకోవడానికి ధియేటర్లను బతికించాల్సిన అవసరం ఉంది. థియేటర్లు బతికితే సినీ పరిశ్రమ బతుకుతుంది. సినీ పరిశ్రమ, సినిమా ధియేటర్లు బతికితే లక్షలాది మందికి ఉపాథి దొరుకుతుంది…. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

అయితే రాజకీయ కారణాలకే ప్రాధాన్యతనిస్తున్న పాలకులు ఇవేవీ ఆలోచించడం లేదు. కమ్మ, కాపు కులస్తులు ఎక్కువగా ఉన్న సినీ పరిశ్రమను అణచి వేసేందుకే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నది. లేకపోతే ఈ విధంగా…. వేలంవెర్రిగా…… థియేటర్లను మూసివేసేలా చేసేందుకు కారణం కనిపించడం లేదు. విధ్వంసం వల్ల సాధించేది ఉండదు. అయినా ప్రభుత్వం వినే పరిస్థితిలో లేదు.

సంక్రాంతికి కళకళలాడాల్సిన సినిమా హాళ్లు మూతపడ్డాయి… ఇక పెద్ద సినిమాలు తీసేందుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చు. పెద్ద సినిమా… అంటే 50 నుంచి 100 కోట్లు పెట్టుబడి పెట్టి తీసే చిత్రాలు ఏడాదికి రెండు మూడు అయినా రాకపోతే సినీ పరిశ్రమ గడ్డు స్థితికి చేరుతుంది. ఒక కోటి, రెండు కోట్లతో తీసే సినిమాలతో ఎక్కువ మందికి ఉపాధి దక్కదు. సినిమా థియేటర్లు కూడా మనుగడ సాగించలేవు.

పెద్ద సినిమాను బతికించుకోవాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. తెలుగు సినిమా రాజధాని అయిన విజయవాడ, ఆ తర్వాతి స్థానంలో కలెక్షన్లు రాబట్టే విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి బావురుమంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న విధ్వంసంతో ఏపి నుంచి సినీ పరిశ్రమ నిష్ర్కమిస్తుందనడంలో సందేహం లేదు.    

Related posts

రెసిడెన్షియ‌ల్  స్కూల్ ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన మంత్రి అల్లోల‌

Satyam NEWS

కోడిపందాల స్థావరంపై పోలీసు దాడులు

Satyam NEWS

వేలం వేస్తున్నవి అన్నీ నిరర్ధక ఆస్తులే

Satyam NEWS

Leave a Comment