38.2 C
Hyderabad
April 25, 2024 12: 47 PM
Slider ప్రత్యేకం

విశ్లేషణ: చెరవీడుతున్నది మనం చెడగొట్టుకోవద్దు

#Lockdown Relaxation

దేశంలో మూడవ విడత లాక్ డౌన్ ముగుస్తున్నది. నాలుగవ విడత 18 వ తేది నుండి  ప్రారంభమవుతుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇటీవల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించిన సందర్బంగా, భవిష్య వ్యూహాలను ఈ నెల 15 వ తేదీకల్లా తెలియజేయమని కోరారు.

ఈ నివేదికల సమర్పణ అనంతరం, 4వ దశ లాక్ డౌన్  అమలులో ఉండే తీరు తెన్నులను 18 వ తేదీ లోపే వివరిస్తామని ప్రధాని తెలిపారు. ఈ దిశగా కేంద్రం నుండి అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఏ తీరులో సాగినా లాక్ డౌన్ ఇంకా కొంతకాలం ఉంటుందనే అంచనాకు ప్రజలు ఇప్పటికే వచ్చేశారు.

ఏదో ఒక రూపంలో కొనసాగే లాక్ డౌన్

మే నెలాఖరు వరకూ ఒక తీరులో, జూన్ నెలలో ఇంకొక తీరులో ఉండవచ్చు. బహుశా జూన్ లో కూడా లాక్ డౌన్ ఉండే అవకాశమే కనిపిస్తోంది. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే, భారతదేశంలో కరోనా అదుపులోనే ఉందని చెప్పాలి.  భౌగోళిక పరిస్థితులు, వైరస్ జన్యుపరమైన అంశాలు, ఆహారం, జీవనశైలి, జీవిత సిద్ధాంతం  ఈ దేశానికి రక్షణ కవచంగా నిలిచాయి.

అహింసను ఆయుధంగా చేసుకొని,  పోరాడి, స్వాతంత్ర్యాన్ని తిరిగి సాధించిన పుణ్యభూమి ఇది. ఈ స్ఫూర్తి ఇంకా మనలో ఉందనే చెప్పాలి. సుమారు 138 కోట్ల మంది జనాభా కల్గిన భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు 85,000 లోపే ఉన్నాయి. కోలుకున్నవారి సంఖ్య కూడా ఆశాజనకంగానే ఉంది.

భారత్ అనుసరించిన విధానం ప్రశంసనీయం

మరణాల రేటు కూడా తక్కువే. కరోనాపై భారత్  పోరాటపటిమను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పలుమార్లు ప్రశంసించింది. ప్రపంచ దేశాలు కూడా మనల్ని అనేకసార్లు అభినందించాయి. ఇటీవల కొంతకాలం నుండి ఏర్పడుతున్న పరిణామాలను పక్కన బెడితే, రెండవ దశ వరకూ భౌతిక దూరం, ఇంటికే పరిమితం కావడం మొదలైన లాక్ డౌన్ నిబంధనలు భారతదేశంలో బాగానే  అమలయ్యాయి.

ప్రజలు క్రమశిక్షణ పాటించారు. మూడవ దశ లాక్ డౌన్ సమయంలో కొన్ని సడలింపులు వచ్చినా, భౌతిక దూరం పాటించడానికే  ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపించారు. సాఫ్ట్ వేర్ రంగమే కాక, మిగిలిన రంగాలకు చెందిన ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కే ఓటు వేస్తున్నారు.

భయాన్ని కలిగించిన వలసకూలీల యాత్రలు, మద్యం

అయితే  ఇటీవల ఇచ్చిన సడలింపులు కొంతమేరకు భయాన్ని కలిగిస్తున్నాయి. లక్షలాది మంది వలస కార్మికుల ప్రయాణాలకు   ఒక్కసారిగా అనుమతులు ఇవ్వడం, మద్యం లాకులు ఎత్తివేయడంతో భౌతిక దూరం అనే అంశం కొంత మందిలో మృగ్యమైపోయింది. ఇది ప్రమాదక ధోరణి. ఈ దుష్ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా గమనిస్తోంది. దీనికి సంబంధించిన నివేదికలు కూడా ఇప్పటికే ప్రభుత్వాలకు వివిధ రూపాల్లో చేరాయి.

కరోనా దుష్ప్రభావంతో,  బతుకు-బతుకుదెరువుకు మధ్య పెద్దపోరాటమే జరుగుతోంది. నిజం చెప్పాలంటే, ఇది ఆరంభం మాత్రమే. బతుకు – బతుకుదెరువుల మధ్య సమన్వయం సాధించి, సత్వర ప్రగతి ప్రయాణానికి ఉద్దీపనగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మనిర్భర్ అభియాన్ కు శ్రీకారం చుట్టారు.

ఇప్పటికి 30 శాతం చరవీడింది

ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముఖంగా ఉద్దీపన చర్యలు వివరించడం ప్రారంభించారు. బిల్ గేట్స్ వంటి దార్శనికులతో కూడా ప్రధాని సమాలోచనలు చేస్తున్నారు. ఈ చర్యలన్నీ సత్ఫలితాలనే అందిస్తాయని ఆశిద్దాం. ఇప్పటి వరకూ ఇచ్చిన  లాక్ డౌన్ సడలింపుల వల్ల,  వివిధ వ్యవస్థలు ముప్ఫయి శాతంకు  పైగా స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చాయి.

18 వ తేదీ తర్వాత వచ్చే,  నాల్గవ విడత సడలింపులు మరింత ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఇక నుండి అమలులో ఉండే  లాక్ డౌన్  పూర్తి భిన్నంగా ఉండబోతుందని ప్రధాని సైతం వ్యాఖ్యానించారు. బహుశా ఇంకో 10-20 శాతం స్వేచ్ఛ పెరుగుతుందని ఊహించవచ్చు.

నిష్క్రమణ సమయంలోనే అప్రమత్తత అవసరం

మే నెలాఖరుకు 40-50 శాతం వివిధ వ్యవస్థలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటాయి. జూన్ నెలలో లాక్ డౌన్ పాక్షికంగానే సాగవచ్చు. 60- 70 శాతం పైగా వ్యవస్థలకు పనిచేసే వెసులుబాట్లు వచ్చేస్తాయి. రాకపోతే?  నిర్మలాసీతారామన్ ప్రకటించిన ప్యాకేజీల ప్రభావం ఊపందుకోదు.

లాక్ డౌన్ నుండి వివిధ స్థాయిల్లో  నిష్క్రమణ దిశగా అన్ని రాష్ట్రాలు వ్యూహాలు, ప్రణాళికలను తీవ్రస్థాయిలో పథకరచన చేస్తున్నాయి. లాక్ డౌన్ నుండి నిష్క్రమణల పర్వం మరింత  వేగవంతమవుతోంది. ప్రపంచం నిష్క్రియాతత్త్వం నుండి బయటకు వస్తోంది. నిబ్బరంగా అడుగులు వేసి, స్వావలంబన సాధిద్దాం.

మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

బంగారు తెలంగాణా కాదు అత్యాచారాల తెలంగాణ అయింది

Satyam NEWS

నందకుమార్, రోహిత్ రెడ్డి గుట్కా వ్యాపార భాగస్వాములు

Satyam NEWS

హన్స్ ఇండియా క్యాలెండర్ ఆవిష్కరించిన ములుగు ఎస్పి

Satyam NEWS

Leave a Comment