26.1 C
Hyderabad
May 15, 2021 05: 12 AM
Slider సంపాదకీయం

విమర్శను తట్టుకోలేని అసహనంలో కమలనాధులు

#narendramodi

వ్యక్తి పూజకు వ్యతిరేకమైన బిజెపిలో అదే జాఢ్యం పెరిగిపోవడం దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి పూజ అధికమనే భావనతోనే ప్రజలు ఆ పార్టీని దేశంలో నామరూపాలు లేకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ పేరు చెబితే అభ్యర్ధి ఎవరు అనేది చూడకుండా దేశంలో 30 శాతం మంది ఓట్లు వేసేవారు.

అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి అభ్యర్ధిని పెట్టినా డిపాజిట్లు కూడా దక్కడం లేదు. ఒకప్పుడు బిజెపికి ఇదే పరిస్థితి ఉండేది. బిజెపి అభ్యర్ధి ఎంత మంచి వ్యక్తి అయినా డిపాజిట్టు వచ్చేది కాదు. ఆ పరిస్థితి నుంచి పెరిగిన బిజెపి ఇప్పుడు దేశంలో ఒక శక్తిగా మారింది.

కాంగ్రెస్ అవలక్షణాలన్నీ వచ్చేశాయి…

అయితే ఇప్పుడు బిజెపి పరిస్థితి ఎలా ఉందంటే అన్నింటికి మోడీనే మందు అన్నట్లుగా తయారైంది. వ్యవస్థాగతంగా మెరుగుపడటం మాట మర్చిపోయిన బిజెపి, అప్పటిలో కాంగ్రెస్ అవలంబించిన అన్ని అవలక్షణాలను అనతి కాలంలోనే అలవరచుకుంది.

అధికారంలో ఉన్న బిజేపీయేతర పార్టీలను చీల్చడం, అవినీతిపరుడైనా సరే పార్టీలో చేర్చుకోవడం,  మాట వినని వారిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో దాడులు చేయించడం, పత్రికలతో బాటు ఎలక్ట్రానిక్ మీడియాను గుప్పిటిలో పెట్టుకోవడం, సోషల్ మీడియాలో ఏ మాత్రం విమర్శ వచ్చినా మూకుమ్మడి ఎదురుదాడి చేయడం బిజెపి లక్షణాలుగా మారిపోయాయి.

దేశ వైవిధ్యాన్ని ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలి…

ఇంత పెద్ద దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు ఆకట్టుకోవడం సాధ్యం కాదు. అలాగని అందరిని అణచి వేయడం కూడా సాధ్యం కాదు. ప్రతిపక్ష పార్టీలు ఏది మాట్లాడినా మూకుమ్మడి దాడి చేయడం కూడా బిజెపికి అలవాటుగా మారిపోయింది.

సహనం అనేది ఏ మాత్రం కనిపించడం లేదు. బిజెపిది హిందూత్వ ఎజెండా అనేది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి తెలిసిపోయింది. దీనికి దేశంలోని ముస్లింలు కూడా అలవాటు పడిపోయారు. అయినా సరే బిజెపి హిందూ ముస్లింల విభేదాలపైనే ఈనాటికీ రాజకీయాలు చేస్తున్నది.

మోడీ దైవాంశ సంభూతుడా?

రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీని దైవాంశ సంభూతుడుగా చూడటం బిజెపి నాయకులకు అలవాటు అయింది. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఎవరు ఏ మాట మాట్లాడినా వారిని దేశద్రోహులు అన్నట్లు చూడడం ఏ లాజిక్ ప్రకారం కరెక్టో అర్ధం కాదు.

‘‘దేశంలో తొలి దశ కరోనాను సమర్ధంగా ఎదుర్కొన్న ధీశాలి మోడీ’’ అని బిజెపి చెప్పుకుంది. ప్రజలు అది నిజమే అనుకున్నారు. అలాంటప్పుడు రెండో దశ కరోనా విషయంలో దారుణంగా విఫలం అయినందుకు కూడా మోడీనే బాధ్యత వహించాలి కదా? అలా కాదట.

రాష్ట్రాలకు బాధ్యత లేదా అని ఎదురుదాడి చేస్తున్నారు. బిజెపి ఎక్కడైనా ఓడిపోతే స్థానిక నాయకులను నిందించడం, బారిని బలిపశువుల్ని చేయడం బిజెపికి అలవాటైంది. ఏ మాత్రం చిన్న విజయం దక్కినా దాన్ని మోడీ ప్రసాదంగా స్వీకరించడం కూడా అలవాటైంది.

రాజకీయ నాయకుడి నుంచి పరిణితి చెందిన రాజనీతిజ్ఞుడు గా మోడీ ఎదగాలంటే ఈ వ్యక్తిపూజను కట్టడి చేసుకోవాలి. ‘‘మోదీ వర్సెస్ దీదీ’’ అని వేరే ఎవరూ చెప్పలేదు… స్వయంగా మోడీనే చెప్పుకున్నాడు. మరి అలాంటప్పుడు దీదీ గెలిస్తే మోదీ ఓడినట్లు అనకూడదా? దాచిపెట్టినంత మాత్రాన అది నిజం కాకుండా పోతుందా? ఎదురు దాడి చేసినంత మాత్రాన నిజం మరుగునపడుతుందా???  

Related posts

హై టెక్ ప్రాసిట్యూషన్:సెక్స్ రాకెట్ గుట్టురట్టు బాలీవుడ్ నటి అరెస్ట్

Satyam NEWS

లిస్బాన్ పబ్ లో పెద్ద ఎత్తున వ్యభిచారం

Satyam NEWS

మళ్లీ క్రమం తప్పకుండా మీ ముందుకు…

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!