27.7 C
Hyderabad
March 29, 2024 04: 16 AM
Slider ప్రత్యేకం

తెలంగాణాలో షర్మిలను ఆదరిస్తారా ! కాదు పొమ్మంటారా ?

#NBSudhakarreddy

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వై ఎస్ షర్మిల తెలంగాణ లో స్వంత పార్టీ ప్రారంభించారు. వైఎస్ఆర్టిపి పేరుతో జండా, అజెండా ప్రకటించారు. అయితే ఆమెను తెలంగాణా ప్రజలు ఆదరిస్తారా లేక తిరస్కరిస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

తండ్రి పేరు, కులం, మతం, కెసిఆర్ పట్ల ప్రజల్లో ఉన్న  వ్యతిరేకత ఆమెకు ఉపయోగపడతాయని ఒక వర్గం విశ్లేషిస్తోంది. అయితే రెండు రాష్ట్రాలలో జరిగిన అనేక రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఆమె ప్రభావం తెలంగాణలో పెద్దగా ఉండదని కూడా వాదనలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో రాజకీయ పార్టీల ప్రారంభం తదితర విషయాలు ఈ సందర్భంగా పరిశీలించాల్సిన అవసరం వచ్చింది. 1969లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణా ప్రజా సమితి ఏర్పాటు చేశారు.1971 జరిగిన ఎన్నికల్లో 11 లోక్ సభ స్థానాలు గెలుచుకున్నారు. తరువాత కాంగ్రెస్ లో చేరి రెండు సార్లు ఆంధ్రపదేశ్ ముఖ్య మంత్రి అయ్యారు.

అలాగే రెండు రాష్ట్రాలకు గవర్నర్ అయ్యారు.1978 లో కాసు బ్రహ్మానందరెడ్డి ఏఐఐసిసి అధ్యక్షునిగా ఉంటూ రాష్ట్రంలో పోటీచేసి కేవలం 30 స్థానాలకు పరిమితమయ్యారు. ఆ ఎన్నికల్లో జనతా పార్టీకి 60 సీట్లు రాగా ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఐ పార్టీ 175 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది తరువాత బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ లో కలిసిపోయారు.

డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి కూడా పులివెందుల నుంచి రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరి మంత్రి అయ్యారు. 1982లో సినీ హీరో ఎన్ టి రామారావు రావు తెలుగు దేశం పార్టీ స్థాపించి 1983 ఎన్నికల్లో తిరుగు లేని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు.

2009లో సినీనటుడు కొణిదల చిరంజీవి స్యంత పార్టీ అయిన ప్రజారాజ్యానికి 18 సీట్లు వచ్చాయి. అయన పార్టీ పోటి చేయడం వల్ల కాంగ్రస్ పార్టీ గెలిచింది. తరువాత ఆయన కూడా పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు.

రాష్ట్రం విడిపోయిన తరువాత  2014లో జనసేన నేత సినీస్టార్ పవన్ కళ్యణ్  ఏపిలో టిడిపికి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ గెలిచి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి అయ్యారు. 2019లో పవన్ స్వంతంగా పోటీచేసి కేవలం ఒక స్థానంతో సరిపెట్టుకున్నారు.

అయన కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవ లేక పోయారు. అయితే తెలంగాణలో 2014, 2019 ఎన్నికల్లో కేసిఆర్ నాయకత్వంలోని తెరాస అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ రాజకీయ శూన్యత ఏర్పడిన దశలో ప్రత్యామ్నాయం చూపి, గ్లామర్ తోడు అవ్వడంతో గెలిచారు.

కెసిఆర్ ఉద్యమం నడిపి ప్రజల మనసు గెలిచి అధికారంలోకి వచ్చారు. ఐఏఎస్ కాదనుకుని లోక్ సత్తాను ప్రారంభించిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ కేవలం తను మాత్రమే ఒకసారి ఎమ్మెల్యే కాగలిగారు. సీబిఐ జాయింట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వి వి లక్ష్మినారాయణ స్వంత పార్టీ పెట్టలేక జనసేనలో చేరి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు.

ఇప్పుడు ఈ పార్టీలు ఏవీ తెలంగాణ లో లేవు. ఆంధ్రాలో కూడా లేవు అది వేరే విషయం. తెలంగాణ ప్రాంత ప్రజలు సెంటిమెంటుకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఉద్యమనేత ప్రొఫెసర్ కోదండరామ్ స్వంత పార్టీ పెట్టి ఎమీ సాధించ లేక పోయారు. ఆఖరికి ఎమ్మెల్సీగా కుడా గేలవ లేక పోయారు.

ఆంధ్రాలో పుట్టి, ఆంధ్రాలో పెరిగి గత ఎన్నికలలో ఆంధ్రాలో ఓటు వేసిన షర్మిలను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం. ఇప్పటికే ఆ పార్టీని ఇడుపుల పాయ పార్టీ అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో కేవలం తండ్రి పేరు, ఆదర్శాలు చెప్పుకుని షర్మిల రాజకీయాలలో రాణించడం అసాధ్యం అనే వారే ఎక్కువ ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కాదని రెడ్డి సామాజివర్గం ఆమె వైపు వచ్చే అవకాశం లేదు.

అలాగే సోనియా గాంధీని కాదని మతం ఓట్లు ఆమె వైపు రావంటున్నారు. కాగా అమెకు అన్న జగన్ మద్దతు కూడా లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మరొక విఫల నేతగా మిగులు తుందా లేక విజేత అవుతుందా వేచి చూద్దాం.

డాక్టర్ ఎన్ బి సుధాకర్ , సీనియర్ జర్నలిస్ట్

Related posts

మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ ఆక్రమించిన క్రిష్టియన్ మిషనరీ స్కూలు

Satyam NEWS

ఇన్ జస్టిస్: అన్నా క్యాంటిన్లు మూసివేయడం అన్యాయం

Satyam NEWS

నకిలీ పురుగుమందులతో రైతులకు తీరని నష్టం

Satyam NEWS

Leave a Comment