Slider తెలంగాణ

మొక్కలు నాటిన యాంకర్‌ అనుసూయ

pjimage (5)

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్  మొదలు పెట్టిన గ్రీన్ ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను యాంకర్ అనసూయ స్వీకరించారు. ఈ మేరకు కేబీఆర్ పార్క్ ముందు జీహెచ్ఎంసీ ఏరియాలో మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత తన కొడుకుతో పాటు యాంకర్ సుమా కనకాల, నటులు అడివి శేషు, ప్రియదర్శి, డైరెక్టర్ వంశీ పైడిపల్లిని తలా మూడు మొక్కలు నాటాల్సిందిగా ఆమె కోరారు. ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్  ను మొదలుపెట్టి కీసర అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ ను అనసూయ అభినందించారు. గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని యాంకర్ అనసూయ పిలుపునిచ్చారు.

Related posts

పకడ్బందీగా పరీక్షల నిర్వహణ

Murali Krishna

మొహం చాటేసిన చంద్రబాబు వియ్యంకుడు

Satyam NEWS

ఉజ్జయిని మహాకాల్ ఆలయం వరకూ రోప్ వే

Satyam NEWS

Leave a Comment