16.2 C
Hyderabad
December 8, 2022 08: 36 AM
Slider తెలంగాణ

రామన్నకు యాంకర్ అనసూయ క్షమాపణ

Anasuya

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నకు సినీ నటి, యాంకర్ అనసూయ క్షమాపణలు చెప్పింది. విరాల్లోకి వెళ్తే, నల్లమల అడవుల్లో యురేనియం వెలికితీతపై అనసూయ ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. విద్యుత్తు ఉత్పత్తి కోసం నల్లమల అడవులను నాశనం చేయవద్దని ఆమె విన్నవించింది. స్వచ్ఛమైన గాలిని ప్రసాదించే చెట్లను చంపేస్తే… భవిష్యత్తులో పీల్చడానికి గాలే ఉండదని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. యరేనియం తవ్వకాలను ఎలా అనుమతిస్తారు సార్? ఆలోచించడానికే భయం వేస్తోందని వ్యాఖ్యానిస్తూ తెలంగాణ మాజీ మంత్రి జోగు రామన్న, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ లకు ట్యాగ్ చేసింది. ఆ తర్వాత ఆమె తన తప్పును గుర్తుంచి, సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. అటవీశాఖ మంత్రిగా గతంలో ఉన్న జోగు రామన్నకు ఈ సారి మంత్రిగా అవకాశం దక్కలేదు. దీంతో, ‘జోగు రామన్న గారు నన్ను క్షమించండి’ అని ట్వీట్ చేసింది. కరెంట్ అఫైర్స్ పై తనకు పట్టు లేదని తెలిపింది. ఈ అభిప్రాయాలను ప్రస్తుత తెలంగాణ అటవీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫార్వర్డ్ చేస్తున్నానని… తన ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరింది. నల్లమల అడవులను కాపాడుదామని విన్నవించింది.

Related posts

విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు

Satyam NEWS

వసంతంలో ఉన్నంత సేపూ..

Satyam NEWS

పరువు హత్య జరగకుండా చొరవ తీసుకున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!