24.2 C
Hyderabad
December 10, 2024 00: 47 AM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

తెలంగాణ మద్యం దుకాణాలకు ఆంధ్రా కిక్కు

liquir shop

కేసీఆర్ ప్రభుత్వానికి మద్యం దుకాణాల కేటాయింపు కోసం కుప్పలు కుప్పలుగా డబ్బులు వచ్చి పడ్డాయి ఎందుకో తెలుసా? రాష్ట్రంలోని 2216 మద్యం దుకాణాలను కేటాయిస్తామని తెలంగాణ ఎక్సయిజు శాఖ ప్రకటన ఇవ్వగానే 48,385 మంది ఎగబడ్డారు. దాంతో ప్రభుత్వానికి రూ.907 కోట్ల రూపాయలు వచ్చేశాయి. దరఖాస్తుదారులు రెండు లక్షల రూపాయలు తిరిగి రాని డిపాజిట్టు కట్టాలి అంటే వేలం వెర్రిగా కట్టేశారు. దరఖాస్తుకు రెండు లక్షల రూపాయలు, అదీ కూడా తిరిగి రాని డిపాజిట్టు కట్టేయగానే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేని రూ.907 కోట్లు వచ్చేసినట్లే. అసలే ఆర్ధిక కష్టాల్లో అదీ కూడా ఆర్ధిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇది మంచి ఆదాయమే. అప్పనంగా వచ్చేసిన ఈ ఆదాయానికి తెలంగాణ సిఎం కేసీఆర్, ఆంధ్రా సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధాక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ఆదాయంలో సింహభాగం ఆంధ్రా సిఎం వల్ల వచ్చిందే. గత ఏడాది ఇలా తిరిగి రాని డిపాజిట్టు కట్టమంటే తెలంగాణ ప్రభుత్వానికి కేవలం రూ.400 కోట్లే వచ్చింది. ఈ సారి అదనంగా వచ్చిన రూ.500 కోట్లు ఏపి సిఎం ఇప్పించిందేననడంలో సందేహం లేదు. ఆంధ్రాలో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. దాంతో చాలా మంది మద్యం షాపులు నడిపేవారు వ్యాపారాలు కోల్పోయారు. ఏం చేయాలో అర్ధం కాని స్థితిలో తెలంగాణ మద్యం షాపుల కేటాయింపు వారికి ఒక వరంగా వచ్చేసింది. దాంతో ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు తమ బంధువుల పేరుతో దరఖాస్తులు దాఖలు చేయించేశారు. కొందరు ఆంధ్రావాళ్లు నేరుగా దరఖాస్తులు పెట్టేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఆంధ్రావాళ్ల దరఖాస్తులు చాలా వచ్చి పడ్డాయి. మేడ్చల్ లో అయితే ఆంధ్రావాళ్లు మద్యం షాపులకు దరఖాస్తు చేయడం పై గొడవ కూడా జరిగింది. అదే విధంగా పాత నిజామాబాద్ జిల్లా లో కూడా ఇదే జరిగింది. ఆంధ్రావాళ్లకు చాలా మందికి తెలంగాణ లో బంధుత్వం ఉంటుంది కాబట్టి ఈ అంశం కలిసి వచ్చింది. ఏది ఏమైనా ఈ మద్యం బంధం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని 900 కోట్లు తెచ్చిపెట్టింది.

Related posts

ఈ పుట్టినరోజు ఒక మెమరబుల్ వీకే న‌రేష్‌

Sub Editor

బీజేపీలో చేరిన బంజారుపల్లి గ్రామస్థులు

Satyam NEWS

తొమ్మిదేండ్ల పాలనలో కేంద్రం అన్ని రంగాల్లో విఫలం

Bhavani

Leave a Comment