27.7 C
Hyderabad
April 20, 2024 00: 30 AM
Slider శ్రీకాకుళం

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు చెక్ పోస్ట్ ను పరిశీలించిన డీఎస్పీ

andhra odisa boarder

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన  పాతపట్నం చెక్ పోస్ట్ ను పాలకొండ డీఎస్పీ రారాజ్ ప్రసాద్ ఈ రోజు పరిశీలించారు. అంతకు ముందు హిరమండలం పోలీస్ స్టేషను పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్ డౌన్ లో భాగంగా ఆంధ్ర ఓడిశా రాష్ట్రాల మధ్య వాహనాలు రాకపోకలు నిషేధించాలని అయన సూచించారు.

పాతపట్నంలో 144 సెక్షన్ అమలును పరిశీలించారు. సరిహద్దులో  సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని,కరోనా పై అప్రమత్తంగా ఉండి పనిచేయాలని, విదేశాల నుండి వచ్చిన వారిపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

అనంతరం మెళియాపుట్టి మండలంలో వసుందర, పట్టుపురం, గొప్పిలి చెక్ పోస్ట్ లను పరిశీలించారు. గొప్పిలి ప్రాంతాల్లో గ్రామస్థులు ఏర్పాటు చేసిన  చెక్ పోస్ట్ ను పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. అలాగే ఒడిశా చెక్ పోస్ట్ ల వద్ద సిబ్బందిని కలిసి కరోనాపై అప్రమత్తం చేసారు.

కరోనా మొదటి దశలోనే నివారణ చేసేందుకు కలిసి పనిచేద్దాం అని వారికి డీఎస్పీ రారాజ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. చెక్ పోస్ట్ ను పరిశీలించిన డీఎస్పీ  రారాజ్ ప్రసాద్ తో పాటు పాతపట్నం సి ఐ ఆర్.రవిప్రసాద్, ఎస్ ఐ టి.రాజేష్ ఇతర సిబ్బంది ఉన్నారు.

Related posts

కురుగంటి చారిటబుల్ ట్రస్ట్ వారి 25 వ వార్షికోత్సవం

Satyam NEWS

రాజంపేట జిల్లా సాధన కోసం రాజీనామా లు చేస్తామన్న వైసీపీ నేతలు

Satyam NEWS

డేంజర్ బట్ న్యూవే:మలద్వారంలో దాచి బంగారం రవాణా

Satyam NEWS

Leave a Comment