39.2 C
Hyderabad
April 25, 2024 18: 21 PM
Slider ఆంధ్రప్రదేశ్

ట్విట్టడం కాదు ముందు మన సంగతి ఏమిటో చూసుకుందాం

kanna map

హైదరాబాద్ లో ఏం అభివృద్ధి జరిగినా తాను వేసిన ఫౌండేషనే కారణమని చెప్పే చంద్రబాబునాయుడిని చూశాం. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు ఆయన తలలోనుంచి వెళ్లినట్లుగా కనిపిస్తున్నది. ఇప్పుడు అమరావతి లో ఏం జరిగినా ఏం జరగకపోయినా చంద్రబాబే బాధ్యుడు అనే సూత్రాన్ని కనిపెట్టారు బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఈ రోజు కన్నా లక్ష్మీనారాయణ ఒక ట్విట్ పెట్టారు. అదేమిటంటే ‘ మోసం నీ సహజ గుణమని నిరూపించావ్ చంద్రబాబు..ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే క్షమించరాని తప్పు చేశావ్.. 5 కోట్ల మంది ఆంధ్రులను 5 సంవత్సరాలు రాజధాని పేరుతో మోసం చేసి కేంద్ర నిధులు లెక్క చెప్పకుండా వేల కోట్లు ఖర్చు చేసి ఆఖరికి దేశ చిత్రపటంలో ఏపి రాజధాని అడ్రస్ లేకుండా చేసి తీరని ద్రోహం చేశావ్’ ఇదీ ఆ ట్విట్. ఈ ట్విట్ చేస్తూ ఆయన మరింత ఉత్సాహంగా  పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా కూడా జత చేశారు. మంత్రిగా పని చేసిన అనుభవం ఉండి, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండి ఇంత అమాయకంగా ట్విట్ ఎలా పెట్టారో కన్నా లక్ష్మీనారాయణకే తెలియాలి. దేశ మ్యాప్ ను ఎవరు తయారు చేస్తారు? దేశ మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎందుకు లేదు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోకుండా మనకు రాజకీయ ప్రత్యర్థి కదా చంద్రబాబు పై బురద చల్లుదామంటే కుదురుతుందా? అసలు మ్యాప్ కు చంద్రబాబుకు సంబంధం ఏమిటి? మ్యాప్ తయారు చేసింది సర్వే ఆఫ్ ఇండియా. ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది. అసలైనా మ్యాప్ లో ఒక ప్లేస్ ఉంచడం తీయడం రాజకీయ నాయకులకు ఏమైనా సంబంధం ఉంటుందా? గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అప్పటి చంద్రబాబునాయుడి ప్రభుత్వం డిక్లేర్ చేయలేదు అనుకుందాం. మరి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిధులు దేనికి ఇచ్చింది? గాల్లో కబుర్లు చెప్పేస్తే నిధులు ఇచ్చేశారా? ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఊరుకున్నది? నిధులకు లెక్కలు అడిగితే ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వానికి తాఖీదు ఇవ్వదా? తాఖీదు ఇచ్చినా సమాధానం ఇవ్వకపోతే చేతకాని వ్యవస్థలా అలా ఉండిపోతుందా? రాజకీయ అత్యుత్సాహంలో కన్నా లక్ష్మీనారాయణ సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా విడుదల చేసిన మ్యాప్ చూడలేకపోయారు. ముందు సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా విడుదల చూసిన మ్యాప్ చూడండి. అందులో కూడా అమరావతి లేదు. మీ పరపతి ఉపయోగించి తక్షణమే మ్యాప్ ను సవరించండి. దీనికి చంద్రబాబు ఏం చేస్తాడు? ఇవన్నీ చేయడానికి ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అడగండి. అమరావతి రాజధాని అవునా కాదా అని. ఓకేనా?

Related posts

కరోనా డ్యూటీలలో అలసత్వం వద్దు: ప్రకాశం జిల్లా ఎస్ పి

Satyam NEWS

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ సత్యాగ్రహం

Satyam NEWS

డా.బి ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం నమూనా విడుదల

Bhavani

Leave a Comment