21.7 C
Hyderabad
December 4, 2022 03: 57 AM
Slider ఆంధ్రప్రదేశ్

15వ తేదీన సీఎం జగన్ అమెరికా పర్యటన

jagan-jpg_710x400xt

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన కుటుంబసభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.  తిరిగి 24వ తేదీన ఆయన తాడేపల్లి కి చేరుకుంటారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత  అదే రోజు ఆయన హైదరాబాద్ వెళ్లనున్నారు. అక్కడి నుంచి కుటుంబసభ్యులతో కలిసి రాత్రికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరుతారు. సీఎం జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డి అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె గ్రాడ్యుయేషన్ సెర్మనీలో పాల్గొనేందుకు జగన్ సతీసమేతంగా వెళుతున్నారు. ఈ నెల 17న డల్లాస్ లోని కే బెయిలీ హచిసెన్ కన్వెన్షన్ సెంటర్ లో ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలతో జరిగే ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. 

Related posts

జుక్కల్ నియోజకవర్గంలో మువ్వనెల జెండాల రెపరెపలు

Satyam NEWS

కల్వకుర్తి మున్సిపాలిటీలో కట్టలు తెగిన అవినీతి

Satyam NEWS

ఏ క్షణమైనా ఏపి సిఎం జగన్ బెయిల్ రద్దు..

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!