21.2 C
Hyderabad
December 11, 2024 21: 16 PM
Slider ఆంధ్రప్రదేశ్

రాయలసీమ ప్రాజెక్టులన్నీ నింపేయాలి

ap-cm-ys-jagan-mohan-reddy

భారీ వర్షాల కారణంగా కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఏపి సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమలో కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి నేడు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నాటికి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. అదే విధంగా రాష్ట్రంలో ఇసుక కొరతపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల కారణంగా ఇసుక అందుబాటులోకి రాలేదని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. గోదావరి, కృష్ణా నదుల్లో ఇంకా వరద ప్రవాహం ఉందని అధికారులు తెలిపారు. వరద తగ్గిన వెంటనే ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. వరదలు తగ్గిన తర్వాత వీలైనంత ఇసుకను స్టాక్‌ యార్డుల్లోకి తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభమవుతాయని  ముఖ్యమంత్రి ప్రకటించారు.

Related posts

ఆర్భాటంగా టీడీపీ కార్యాలయం ప్రారంభం….

Satyam NEWS

నూజివీడులో బ్యాంకు ఉద్యోగుల ఆందోళన ర్యాలీ

Satyam NEWS

రాజాంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి

Satyam NEWS

Leave a Comment