ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు నేటి సాయంత్రం ఏపీ సీఎం జగన్ దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ పర్యటన దృష్ట్యా సిఎం షెడ్యూల్ లో మార్పులు చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఓంకారం వద్ద రాష్ట్ర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. సిఎం పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు. దేవాలయంలో సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. ఈ రోజు సాయంత్రం సిఎం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు
previous post