ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు దుర్గమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీ మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ జగన్మాతకు పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ సంప్రదాయంలో భాగంగా ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో వేదపండితులు, అధికారులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వారిలో ఆలయ ఈఓ ఎమ్.వి.సురేష్ బాబు కూడా ఉన్నారు. పర్వట్టంతో ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి అలంకరించగా, ఆయన తలపై పట్టు వస్త్రాలను పెట్టుకుని అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్ సమర్పించారు
previous post
next post