అగ్రికల్చర్ కమిటీల నుంచి వచ్చే సమాచారాన్ని బేరీజు వేసుకోవడానికి మరో యంత్రాంగం అవసరమని ఏపి సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయ మిషన్ పై నేడు ఆయన సమీక్షించారు. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్‌పై సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని ఆయన సూచించారు. ఇప్పుడున్న వ్యవస్థ ఎలా నడుస్తుందో పరిశీలించండి. ప్రత్యామ్నాయ విధానంకూడా ఉండాలని సిఎం స్పష్టం చేశారు. పంటల ధరలను స్థిరీకరించడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం వైయస్.జగన్ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌పై ఒక సెల్‌ను ఏర్పాటుచేయాలని, అత్యుత్తమ నిపుణులను ఇందులో నియమించాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ మిషన్ తదుపరి సమావేశంలో రాబోయే పంటల దిగుబడులు, వాటి లభించే మద్దతు ధరల అంచనాలు, మార్కెట్‌లో పరిస్థితులను నివేదించాలని సీఎం ఆదేశించారు. మినుములు, పెసలు, శెనగలు, టమోటాలకు సరైన ధరలు రావడంలేదని అధికారులు సిఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం వద్ద, రైతుల వద్ద నిల్వలు ఉన్నాయని, దీంతోపాటు దిగుమతి విధానాలు సరళతరం చేయడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలని వారు తెలిపారు. వచ్చే రబీ సీజన్‌లో పప్పుదినుసలకు తక్కువగా ధరలు నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు సిఎం దృష్టికి తీసుకువెళ్లారు. టమోటా, ఉల్లి పంటలకు సంబంధించి, ఈ పంటలకు సంబంధించి కొనుగోళ్లకోసం ప్రణాళిక వేశారా? లేదా? అని సీఎం అధికారులను అడిగారు. అక్టోబరు 15 నాటికే మినుములు, పెసలు,శెనగల తదితర పంటల కొనుగోలుకోసం కేంద్రాలు తెరవాలని సీఎం ఆదేశం ఇచ్చారు. కరువు కారణంగా ఆయా జిల్లాల్లో పరిస్థితులను సీఎంకు అధికారులు నివేదించారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 1830 కోట్ల రూపాయలను ఈ నెలాఖరులో రైతులకు ఇస్తున్నామని అధికారులు తెలిపారు.
previous post