37.2 C
Hyderabad
March 29, 2024 17: 30 PM
Slider సంపాదకీయం

కోర్టును ధిక్కరించడం హీరోయిజం అనిపించుకోదు

#APHighCourt

న్యాయస్థానాలలో ఎదురు దెబ్బలు తగులుతుంటే న్యాయమూర్తులపై ఎదురు తిరుగుతున్నారే తప్ప పాలనావ్యవహారాలను చక్కదిద్దుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయబద్దంగా తీర్పులు చెబుతుంటే వాటిని పరిశీలించి అనుగుణంగా వ్యవహారాలను మార్చుకోవాలి.

అందులో ఎలాంటి భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. న్యాయం, చట్టం ధర్మానికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరమే రాదు. అలా కాకుండా నిర్ణయాలు తీసుకున్న సమయంలోనే కోర్టులు జోక్యం చేసుకుంటాయి.

కోర్టులు ఉన్నట్లుగానే రాజ్యాంగ వ్యవస్థలు కూడా చాలా ఉంటాయి. వాటన్నింటిని కూడా తామే అదుపు చేస్తామంటే పాలనావ్యవస్థకు కుదరదు. రాజ్యాంగ వ్యవస్థలు వాటి పని అవి చేయాలి. అయితే దురదృష్ట వశాత్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకుంటున్న ఏ నిర్ణయానికీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు.

సహకరించకపోగా ఎదురుదాడి చేయడం, ఎన్నికల కమిషనర్ కు కులాన్ని ఆపాదించి, చంద్రబాబుతో సంబంధం అంటగట్టి మంత్రులు మాట్లాడటం ప్రతి రోజూ జరుగుతూనే ఉంది. ఇదే ఎన్నికల కమిషనర్ హయాంలో ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో సహా మంత్రులు అందరూ మర్చిపోయారు.

ఏకగ్రీవ ఎన్నికలు జరిగినప్పుడు ఉన్న ఎన్నికల కమిషనర్ ఆ తర్వాత కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయగానే ఆయనను కులం పేరుతో దూషించారు. ఎన్నో పరిణామాల తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం తన విధులను నిర్వర్తించేందుకు మొదలు పెట్టిన అయిన నాటి నుంచి అడ్డంకులు చెబుతూనే ఉన్నారు.

అధికారికంగా ఒకటి చేస్తూ మంత్రులతో మరొకటి మాట్లాడించడం ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి. ఉన్నత అధికారులు కూడా ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే విధంగా చేయడం ప్రభుత్వం గొప్పతనం అయితే మాత్రం కాదు.

ఏపి హైకోర్టు పంచాయతీ ఎన్నికలపై కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇదంతా చర్చించుకోవాల్సి వస్తున్నది. స్థానిక సంస్థల  ఎన్నికలపై ఎస్.ఈ.సి.దే తుది నిర్ణయం అని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ సందర్భంగా ఎస్.ఈ.సి. తరపున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు.

అశ్వనీకుమార్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ప్రభుత్వం నుంచి ముగ్గురు సీనియర్ అధికారులను ఎస్.ఈ.సి. వద్దకు పంపించాలని ధర్మాసనం సూచించింది. ఎస్.ఈ.సి. ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

గతంలో చాలా ఆదేశాలను పక్కన పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను పాటిస్తుందో లేదో తెలియదు. కోర్టు ఆదేశాలను ధిక్కరించడం, ఎన్నికల కమిషనర్ కు కులాన్ని ఆపాదించడం కొందరికి ఆనందం కలిగించవచ్చు. అయితే ప్రజాస్వామ్యవాదులు మాత్రం ఏవగించుకుంటున్నారు.

ఇప్పటికైనా రాజ్యాంగ సంస్థల పట్ల పాలనావ్యవస్థ బాధ్యతతో వ్యవహరించాలి.

Related posts

“అన్నపూర్ణ ఫొటో స్టూడియో” సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

Bhavani

కన్నబాబు మౌనానికి అర్ధం ఏమిటి ?

Bhavani

మా పార్టీ ప్లీనరీ అట్టర్ ఫ్లాప్: రఘురామ వ్యాఖ్య

Satyam NEWS

Leave a Comment