ఎట్టకేలకు చట్టం మేల్కొంది. అసెంబ్లీకి చెందిన కోట్ల రూపాయల ఫర్నీచర్ ఇతర విలువైన సామాగ్రిని సొంతానికి తరలించి వాడుకున్న ఏపి అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు అయింది. అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరావు ఫిర్యాదు మేరకు తుళ్ళూరు పీఎస్ లో కేసు నమోదు చేశారు. తుళ్ళూరు పోలీస్ యాత్రాoగం ఆయనపై Ipc 409,ipc,414, సెక్షన్ల క్రింద కేస్ నమోదు చేసింది. అసెంబ్లీ సామాగ్రి సొంత ప్రయోజనాలకు వాడుతున్నట్లు ప్రాధమికంగా నిర్దారణ కు రావడంతో కేసు పెట్టారు. ఆయన ఇల్లు, ఆయన కుమారుడి కి చెందిన బైక్ షోరూమ్, పార్టీ కార్యాలయాలలో అసెంబ్లీ ఫర్నిచర్ వినియోగించినట్లు రూఢికావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కోటి రూపాయల విలువైన అసెంబ్లీ సామాగ్రిని సొంతానికి వాడుకున్నాడని ఫిర్యాదు రావడంతో ఆయా స్థలాలకు వెళ్లిన అధికారులను కోడెల కు చెందిన మనుషులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాను తీసుకువెళ్లమని చెప్పానని అయినా అసెంబ్లీ అధికారులు తీసుకువెళ్లలేదని కోడెల కథలు చెప్పినప్పటికి ఎవరూ నమ్మలేదు. కేసు తీవ్రతను ముందుగానే గ్రహినంచిన కోడెల తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్పి తన కుమార్తెకు చెందిన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గంట గంటకు హెల్త్ బులిటెన్ విడుదల చేసి తెలుగుదేశం పార్టీ వారిని రెచ్చగొట్టి సెంటిమెంటును రేకెత్తించి కేసు నుంచి బయటపడాలని కోడెల ప్రయత్నించిన విషయం కూడా సత్యం న్యూస్ వెలుగులోకి తెచ్చింది. విషయం అర్ధమైన చంద్రబాబునాయుడు కూడా ఇప్పటి వరకూ ఆయనను వ్యక్తిగతంగా వెళ్లి పరామర్శించలేదు. కేవలం ఫోన్ లో డాక్టర్లతో మాట్లాడినట్లు కోడెల ఆరోగ్యంపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసినట్లు కవరప్ ఇచ్చారు అంతే. తెలుగుదేశం నేతలు కొందరు కోడెలను పరామర్శించేందుకు ఆసుపత్రి వద్దకు వెళ్లినా ఆసుపత్రి వైద్యులు ఆయనను చూపించలేదు. దాంతో వారు వెనుదిరిగారు. ఇది మరింత అనుమానాలకు దారితీసింది. ఎట్టకేలకు కోడెలపై కేసు నమోదు అయింది. మాజీ స్పీకర్ లకు ఎలాంటి చట్ట రక్షణ ఉండదు కాబట్టి ఈ కేసులో ఆయనను అరెస్టు చేయడానికి అవకాశం ఉంది.
previous post