24.7 C
Hyderabad
July 18, 2024 07: 43 AM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

ఏపి రైతు సాధికార దోపిడి సంస్థ

pjimage (11)

పేద రైతుల రుణ మాఫీలో కూడా కుంభకోణం చేయవచ్చునని నిరూపించిన ఘనులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారనే బాధతో అమలు చేయాల్సిన రుణమాఫీని పాడి ఆవుగా మార్చుకుని అవసరమైనప్పుడల్లా పాలు పిండుకున్న పెద్ద మనుషులు ఇప్పుడు, సంపాదించిన డబ్బులతో కులాసాగా బతుకుతున్నారు. రైతులు మాత్రం ఇంకా అప్పుల్లోనే మగ్గుతున్నారు. ప్రభుత్వం మారింది కదా ఈ అప్పుల పాపాత్ములు బయటకు వస్తారనుకుంటే ఎందుకో గానీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకు అవసరమైన చర్య ఒక్కటీ చేపట్టలేదు. పైగా పాత రుణమాఫీ జీవోలను నేడు రద్దు చేసేసింది.

అక్రమాలు తేల్చకుండా జీవోలు రద్దు చేసేస్తే ఇక పాత దొంగలు దొరుకుతారా? కచ్చితంగా దొరకరు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మాయ చూపించి కోట్లు కొట్టేసిన పెద్ద మనుషులు ఇక బేఫికర్ ఉండచ్చు. పాత జీవోలు రద్దయిపోయాయి కదా. ఇప్పుడు తెలుగుదేశం, దాని అనుబంధ మీడియా మొదలు పెడుతుంది ఏమనో తెలుసా? మేం రైతుల మేలు కోసం ఇచ్చిన రుణ మాఫీ జీవోలను కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేసేసింది అని. ఒక వైపు డబ్బు కొట్టేసిన వాడు కులాసాగా ఉన్నాడు. నిజమైన రైతు డబ్బు అందక ఇబ్బంది పడుతున్నాడు. చెడ్డ పేరు జగన్ ప్రభుత్వానికి, ప్రచార లాభం తెలుగు దేశానికి. అయ్యా స్థూలంగా ఇదీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అతి పెద్ద కుంభకోణానికి సమాధి కట్టే ప్రయత్నం.

తెలుగుదేశం నాయకులతో సన్నిహితంగా ఉన్న అధికారులు వేసిన, వేస్తున్న ఎత్తుగడలు ఇవి. పాలనానుభం లేని జగన్ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ చూస్తూ ఊరుకుంటోంది. రుణమాఫీ పేరుతో దాదాపు 500 కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగిందని సాక్ష్యాధారాలతో సహా ఉన్నా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. 2013 డిసెంబర్ 31 వరకూ ఉన్న లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామని అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఎన్.చంద్రబాబునాయుడు తన పాదయాత్ర సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ హామీని నమ్మిన ప్రజలు ఆయనకు ఓట్లేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిని చేశారు.

అసలే డబ్బుల్లేని ప్రభుత్వ ఖజానా రుణమాఫీకి సహకరించలేదు. దాంతో బ్యాంకుల వద్దకు అప్పులకు వెళ్లారు. అప్పు తీసుకువచ్చి రుణమాఫీ చేశారు. ఓకే అంత వరకూ బాగానే ఉంది. అప్పు తెచ్చిన డబ్బు నిజాయితీగా రైతులకు చేరి ఉంటే సత్యం న్యూస్ ఇంత రాయాల్సిన అవసరమే లేదు. నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు కొట్టేశారు. రైతు సాధికార సంస్థలో ఉన్న అధికారులు. ఆ పైన ఉన్న సలహాదారులు. బ్యాంకు ద్వారా చెల్లించిన రుణ మాఫీలో కుంభకోణం ఎలా జరిగిందని అనుకోవచ్చు. అక్కడే రైతు సాధికార సంస్థ అధికారులు తమ గత అనుభవానికి పదును పెట్టారు. బ్యాంకింగ్ రంగంలో, స్టాక్ మార్కెట్ లో, ఇన్స్యూరెన్పు కంపెనీల్లో అనుభవం ఉన్న అధికారులు సలహాదారులు తిమ్మని బమ్మిని చేసి రైతు ఎకౌంట్లలోకి వెళ్లాల్సిన డబ్బుల్ని కొట్టేశారు. (ఇంకా ఉంది)

Related posts

బొబ్బ‌లి,నెల్లిమ‌ర్ల‌లోనే టీడీపీ గ‌ట్టిగా ప‌ని చేసింది..

Satyam NEWS

బెడ్ రెస్ట్ లో ఉన్న వ్యక్తికి సాయం

Satyam NEWS

మేక తల బదులు మనిషి తలనరికిన తలారి

Satyam NEWS

Leave a Comment