35.2 C
Hyderabad
April 20, 2024 18: 17 PM
Slider నిజామాబాద్

అంగన్వాడీ కేంద్రాల విలీనం తక్షణమే ఉపసంహరించుకోవాలి

#anganwadi

అంగన్వాడీ కేంద్రాల విలీనం తక్షణమే ఉపసంహరించుకొని, ఐ సి డి ఎస్ ను యధావిధిగా కొనసాగించాలని సి ఐ టి యు డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 14వేల అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోకి తరలించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించినట్లు పత్రికల్లో వచ్చిందని కామారెడ్డి జిల్లా సి ఐ టి యు జుక్కల్ జోన్ కన్వీనర్ సురేష్ గొండ తెలిపారు.

ఇప్పటికే రంగారెడ్డి జిల్లా యాచారం లో అధికారులు ఈ ప్రయత్నాన్ని ప్రారంభించారని ఇలా చెయ్యడం ద్వారా 40కోట్ల భారం తగ్గుతుందని ప్రభుత్వం చెప్పడం సరికాదని ఆయన అన్నారు. నూతన విద్య విధానంతో అంగన్వాడీ వ్యవస్థ కే ప్రమాదం ఉందని, అందువల్ల ఆ జీవోను వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన పి ఆర్ సి వేతనాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. పి ఎఫ్, ఇ ఎస్ ఐ, సౌకర్యం కల్పిస్తూ అద్దె భవనాల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

కనీస వేతనం 21వేలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్ మండలాల్లోని తాసిల్దార్ లకు 18డిమాండ్లతో కూడిన వినతిపత్రలను సమర్పించారు. ఈ కార్యక్రమం లో సి ఐ టి యు నాయకులు బి. ఆడేప్ప, కె. నారాయణ. ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు చంప బాయి, అనసూయ, తోపాటు సెక్టార్ నాయకులు ఆశ తాయి, సునంద, రాజశ్రీ, యమున, గంగవ్వ, అశ్విని, శోభ, శారదా, విజయ, వనజ, రేణుక, సురేఖ, సుమలత, బుజి బాయి,  హన్మవ, లత తాయి 4 మండలాల అంగన్వాడీ టీచర్లు ఎక్కడి వారు అక్కడ పాల్గొని తాసిల్దార్ లకు వినతిపత్రలను అందజేశారు.

జి.లాలయ్య సత్య౦ న్యూస్  రిపోర్టర్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

గ్రానైట్ కంపెనీ లలో ఫెమా నిబంధనల ఉల్లంఘన

Murali Krishna

గుడ్ డెసిషన్: మేడారం లో ప్లాస్టిక్ ను నిషేధిద్దాం

Satyam NEWS

ఈటల రాజేందర్‌కు కేంద్ర బలగాల సెక్యూరిటీనా..!

Bhavani

Leave a Comment