అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం తారామణి. ఈ చిత్రానికి రామ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని జె.ఎస్.కె ఫిలిం కార్పొరేషన్ సమర్పణలొ డి.వి.సినీ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ బ్యానర్‌పై ఉదయ్ హర్ష వడ్డేల్ల, డి.వి.వెంకటేష్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 6 న విడుదల కు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇదొక ట్రయాంగులర్ లవ్‌స్టోరీ. సినిమాలో ఎమోషనల్ కంటెంట్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉంటాయి. ప్రతి సన్నివేశం మనసును హత్తుకునేలా ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో స్త్రీల ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సినిమా సాగుతుంది. ప్రస్తుతం యువత టెక్నాలజీ మాయలో పడి ఎలా ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు. ఫలితంగా వారెలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే అంశాలు కూడా సినిమాలో ఉంటాయి. ఈ సినిమా ట్రైలర్‌ను యూనివర్సల్ హీరో కమల్ హాసన్, పాటలను సూపర్‌స్టార్ రజనీకాంత్ విడుదల చేశారు. ట్రైలర్, పాటలకు ఆడియెన్స్ నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
previous post