జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దేవుడికి ఘోర అపచారం జరిగింది. అక్కడి అంబటిపల్లి అమరేశ్వర ఆలయంలోని హనుమాన్ విగ్రహం అనుమానాస్పద పరిస్థితుల్లో దగ్దం అయింది. నిన్న సాయంత్రం ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. హనుమాన్ విగ్రహం వద్ద మంటలు వ్యాపించి విగ్రహం దగ్ధమైందని అంటున్నారు. ఈ ఘటనను ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా చేశారా లేక ప్రమాదవశాత్తూ మంటలు వ్యాపించాయా అనే ఆందోళన భక్తులలో ఉంది. విగ్రహం దగ్దం అవడం ఊరికి అరిష్టమని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
next post