31.7 C
Hyderabad
April 18, 2024 23: 16 PM
Slider ఆదిలాబాద్

ఓ అభయ ఆంజనేయా నీకే దిక్కులేదా స్వామీ?

#Abhya Anjaneya Swamy

ఆంజనేయస్వామి అపర బలవంతుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చే ఘనుడు అనుకుంటారు కదా? అస్సలు కాదు. ఆయన నిస్సహాయుడు. అడ్డుపడుతున్న వారిని అడ్డుతొలగించుకోలేనంత నిస్సహాయంగా మారిపోయాడు. పాపం ఆంజనేయస్వామి.

కొమురంభీం జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్కపల్లి గ్రామ ముఖద్వారం వద్ద నిలబడిపోయిన ఈ ఆంజనేయస్వామిని చూస్తుంటే జాలేస్తుంది. అసలు విషయం ఏమిటంటే విదేశాల్లో స్థిరపడ్డ ఎల్కపల్లి గ్రామస్థులు, మరి కొంతమంది దాతలు కలిసి ఊరు బాగుండాలని, దేవుని ఆశీస్సులు ఎల్లవేళల గ్రామస్థులపై ఉండాలనే సదుద్దేశంతో దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం ఎల్కపల్లి గ్రామం ముఖ ద్వారానికి ఎదురుగా ప్రధాన రోడ్డుకు పక్కన ముప్పై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించేందుకు నిర్ణయించుకున్నారు.

ధూం ధామ్ గా జరిగిన భూమి పూజ

భూమి పూజ ధూంధామ్ గా చేశారు. పండుగలా జరిగిన భూమి పూజ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ హాజరయ్యారు. కొబ్బరికాయలు కొట్టారు. వారిని చూసి ప్రజలు చప్పట్లు కొట్టారు. అంతే ఆంజనేయ స్వామి తమ ఊరికి వచ్చినంత ఆనంద పడిపోయారు ఎల్కపల్లి వాసులు.

విగ్రహ నిర్మాణం మొదలు పెట్టారు. ఆంజనేయస్వామి విగ్రహం సగం వరకూ పూర్తి అయింది. అప్పుడు గుర్తుకు వచ్చింది….. అటవీ శాఖ అధికారులకు. ఏమిటది ఏమి గుర్తుకు వచ్చింది అనుకుంటున్నారా? చాలా కీలక విషయం అది. ఆంజనేయస్వామి విగ్రహం పెడుతున్న స్థలం అటవీ శాఖ వారిదట.

నెలలు గడిచినా మోక్షం కలగడం లేదు

అందుకు అనుమతి లేకుండా ఆంజనేయస్వామి విగ్రహం కడుతున్నారని నిర్మాణం మధ్యలో ఆపేశారు. అటవీశాఖ అధికారులు నిర్మాణాన్ని ఆపి దాదాపుగా నెలలు గడిచిపోయింది. ఊరి ముఖ ద్వారంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేస్తే దేవుడి ఆశీస్సుల తో గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉంటామని అనుకున్నా.. చివరికి అనుమతులు లేవని అధికారులు చివరిదశలో ఆపడం తో గ్రామస్థులు తీవ్ర నిరాశతో వున్నారు.

ఇలా దేవుడి విగ్రహం మధ్యలో ఆపేయడం ఊరికే అరిష్టంగా మారుతుందని గ్రామస్థులు వాపోతున్నారు. అటవీ భూములు ఎంతో మంది అక్రమంగా కబ్జా చేసి కట్టడాలు నిర్మిస్తున్నా.. అటవీ భూమిలో వ్యవసాయం చేస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరించే అధికారులు, విగ్రహ నిర్మాణం కేవలం గుంటన్నర భూమి లో అది కూడా ఎవరి స్వలాభం కోసం కాదని, దేవుని ప్రతిమ నిర్మాణానికి అడ్డుకోవడం సమంజసం కాదని ఎల్కపల్లి గ్రామస్థులు అంటున్నారు. 

భూమి పూజకు వచ్చినప్పుడు కళ్లకు ఏం అడ్డం పెట్టుకున్నారు?

గ్రామ, మండల ప్రజల అవసరాల దృష్ట్యా అటవీ భూములను వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కానీ క్రింది స్థాయి అధికారులు ఏమి తెలియనట్లు ఉంటున్నారని గ్రామస్థులు అంటున్నారు. కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేసేప్పుడు అటవీ అధికారులు సైతం వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారని గ్రామస్థులు అంటున్నారు.

పూజ సమయంలో శాసనసభ్యులు కూడా పాల్గొన్నారని మరి అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందని గ్రామస్థులు అడుగుతున్నారు. ఎల్కపల్లి గ్రామంలో ఆంజనేయ విగ్రహ నిర్మాణం  అనుమతులు లేకుండానే నిర్మాణం జరుగుతుంది.  ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలకైనా కలెక్టర్ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. ఈ విషయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాబట్టి చట్టాలకు లోబడి పనులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలెక్టర్ అనుమతులు ఉండాల్సిందే అని పెంచికల్ ఎఫ్ఆర్ఓ అంటున్నారు.

Related posts

కేసీఆర్‌ మాకు పెద్దన్నలాంటి వారు

Satyam NEWS

రాజకీయ నాయకుల రాకతో సందడిగా వివాహ రిసెప్షన్

Satyam NEWS

మలిదశ తెలంగాణ ఉద్యమనేత ఆకస్మిక మరణం

Satyam NEWS

Leave a Comment