39.2 C
Hyderabad
April 18, 2024 16: 21 PM
Slider మహబూబ్ నగర్

పది రూపాయలు ఇస్తేనే దర్శనమిస్తానంటున్న అంజన్న.

అంజన్న దర్శనం కావాలంటే పది రూపాయలు ఇవ్వాల్సిందేనని ఊరుకొండ పేట దేవాలయంలో అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారు. నేడు కార్తీక మాసం చివరి శనివారం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీంతో అధికారులు అర్చన టికెట్లు దర్శనం కోసం వినియోగిస్తున్నారు. పూజారులు దక్షిణ కోసం, కొబ్బరికాయలు కొట్టే చోట వివిధ వ్యక్తులు కొబ్బరికాయ మేమే కొడతామని కొడితే పది ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారు. అదేవిధంగా కార్తీకమాసం సత్యనారాయణ స్వామి వ్రతాలు చాలావరకుఊరుకొండ మండలంలోని ఊరుకొండ పేటలో అధిక సంఖ్యలో భక్తులు వ్రతాలను నిర్వహిస్తుంటారు. దేవాలయానికి సంబంధించిన టికెట్ తీసుకొని కూడా పూజారులు 500 1000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా భక్తులు దర్శనానికి పది రూపాయలు ఎందుకని అడిగితే పది రూపాయలు మిగిల్చుకొని బిల్డింగులు కడతావని దూషించడమే కాక భక్తులపై అసభ్యకరంగా పదజాలంతో దూషిస్తున్నారు. ఇంటి దగ్గరే ఉంటే స్వామి సన్నిధికి రావడానికి బస్సు చార్జీలు కూడా మిగులుతాయని భక్తులను అపహాస్యం చేస్తున్నారు. కొందరు డబ్బులు తీసుకురాక స్కాన్ ఉంటే గూగుల్ పే ఫోన్ పే చేస్తామని ప్రశ్నించగా స్కానర్ లేదని డబ్బులు ఇస్తేనే దర్శనం ఇస్తానని కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. భక్తులక్యూలైన్ ముందుకు సాగకపోవడంతో కొందరు ముందుకు వెళ్లాలని సూచించడంతో వదిలేశారు. పది రూపాయల ఇస్తేనే స్వామివారి దర్శనం ఉంటుందని ఉచిత దర్శనాలు లేవని ఖరాఖండిగా చెప్తున్నారు.కొందరు భక్తులు ఈ దేవాలయంలో ఉచిత దర్శనమే లేదా అని ప్రశ్నించగా పది రూపాయలు ఇస్తేనే దర్శనం అని ఎప్పుడైనా అంతే అని కార్తీక మాసం ఒక్క మాసంలోనే తీసుకోవడం లేదని స్వామివారిని దర్శిస్తే పది కావాల్సిందేనని అధికారులు సమాధానం ఇస్తున్నారు.ఇదెక్కడి న్యాయం అంటూ భక్తులు భగవంతుని చూడటానికి కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఉచితంగా దర్శన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Related posts

‘గని’ కి తగ్గించారు

Sub Editor 2

పశ్చిమగోదావరి జిల్లాలో వసతి గృహంలో బాలిక అనుమానాస్పద మృతి?

Satyam NEWS

అంబర్ పేట్ లో బస్తీలో బిఆర్ఎస్ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment