33.2 C
Hyderabad
April 26, 2024 02: 58 AM
Slider ప్రత్యేకం

బట్టల కొట్లుగా మారబోతున్న అన్న క్యాంటిన్లు

#AnnaCanteen

నిరుపయోగంగా ఉన్న అన్న క్యాంటిన్ల భవనాలను ఉపయోగంలోకి తీసుకురావాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ క్యాంటిన్ల భవనాల్లో ఆప్కో షోరూములను తెరవాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది.

ప్రభుత్వ నిర్ణయాన్ని మున్సిపల్ శాఖ అమల్లోకి తీసుకురాబోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా నిరుపయోగంగా పడున్న అన్న క్యాంటిన్ల న్నింటిలోను వీలైనంత తొందరలో చేనేత వస్త్రాల సేల్స్ కౌంటర్లు తెరవాలని నిర్ణయించారు.

చంద్రబాబు నాయుడి హయాంలో పేదలకు అన్నంపెట్టిన అన్న క్యాంటిన్లు వైసీపీ అధికారంలోకి రాగానే మూత పడిపోయాయి.

అలాంటిది మళ్ళీ ఇంత కాలానికి క్యాంటీన్లను ఏదో రూపంలో తెరవాలని ప్రభుత్వం నిర్ణయించు కున్నది. ఈ మేరకు ఆప్కో నుండి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించి మున్సిపల్ శాఖకు ఆదేశాలను జారీ చేసింది.

ఈ సందర్భంగా  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 100 అన్నక్యాంటిన్ల లో తొందరలోనే చేనేత సేల్స్ కౌంటర్లు ఏర్పాటు కాబోతున్నాయి.

Related posts

సబ్బు, శానిటైజర్ తో చేతులు ఎందుకు కడుక్కోవాలి?

Satyam NEWS

కరోనా బాధితులకు పండ్లు కూరగాయల పంపిణీ

Satyam NEWS

మిర్యాలగూడతో పాటు వైరా ఇవ్వకపోతే ఒంటరిగానే పోటీ

Satyam NEWS

Leave a Comment