27.7 C
Hyderabad
April 25, 2024 07: 00 AM
Slider జాతీయం

అస్వస్థతకు గురైన అన్నా హజారే.. ఆస్పత్రికి తరలింపు

ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను పుణెలోని రూబీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం హజారే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అయినప్పటికీ వైద్యుల పరిశీలనలో ఉంచి చికిత్స అందజేస్తున్నామని రూబీ హాస్పిటల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అవధూత్‌ వెల్లడించారు.

ఛాతీ నొప్పి, నీరసం కారణంగా హజారే ఆస్పత్రిలో చేరారు. ఆయనకు యాంజియోగ్రఫీ నిర్వహించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. హజారే ఆరోగ్య పరిస్థితిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే ఆరా తీశారు. కాగా ప్రస్తుతం ఉద్ధవ్‌ కూడా హెచ్‌ ఎన్‌ రిలయన్స్‌ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ చికిత్స తీసుకుంటున్నారు.

Related posts

కుమార్తెలను చంపేసి తండ్రి ఆత్మహత్య..

Satyam NEWS

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సీతక్క

Bhavani

రాఫెల్ యుద్ధ విమానాలు మిమ్మల్ని ఏమీ చేయలేవ్

Satyam NEWS

Leave a Comment