31.2 C
Hyderabad
February 14, 2025 20: 31 PM
Slider ఆధ్యాత్మికం

21న తిరుమలలో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం

annamayya

పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 517వ వర్ధంతిని పురస్కరించుకుని మార్చి 21వ తేదీ శ‌నివారం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం ఘనంగా జరుగనుంది. శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6.00 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. 

శ్రీ అన్నమాచార్య గురుపరంపరకు చెందిన శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీజి అనుగ్రహభాషణం చేస్తారు. టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భజన బృందాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Related posts

ఉప్పల్ అభివృద్ధి పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఎన్వీఎస్ఎస్ చర్చ

Satyam NEWS

అయోధ్యలో పెద్ద ఎత్తున హోటళ్లు పెడుతున్న OYO

Satyam NEWS

సుబ్రమణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి

Satyam NEWS

Leave a Comment