39.2 C
Hyderabad
March 29, 2024 15: 18 PM
Slider ప్రకాశం

పోలీసులు క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్: ప్రకాశం జిల్లా ఎస్పీ

#prakashamdistrictpolice

ప్రకాశం జిల్లా పోలీసు శాఖలో అత్యుత్తమ సేవలందించిన సిబ్బందికి ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా పతకాలు ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది అద్భుతమైన పెరేడ్ ప్రదర్శన నిర్వహించారు. ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలోని ఆర్మడ్ రిజర్వ్ సిబ్బంది పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన పెరేడ్ కు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

అనంతరం సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పెరేడ్ వాహనం ఎక్కి ప్లటూన్ లు ఎస్పీ పరిశీలించారు. పెరేడ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ పెరేడ్ పోలీస్ కల్చర్ లో ఒక భాగమని, ఎఆర్ సిబ్బంది అద్భుతమైన పెరేడ్ ప్రదర్శన చేశారని అభినందించారు. పెరేడ్, స్పోర్ట్స్ మీట్ వంటివి సిబ్బందిలో టీమ్ వర్క్ ను, క్రమశిక్షణను, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో దోహదపడతాయని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలగా కోవిడ్ ఉదృతి వలన పెరేడ్ నిర్వహించలేకపోయామని, ఇక నుండి పెరేడ్ ను క్రమపద్దతిన నిర్వహించటం జరుగుతుందని, అలాగే హోం గార్డ్ లకు కూడా పెరేడ్ నిర్వహించటం జరుగుతుందని తెలియచేశారు.

Related posts

వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్య అధికారి

Satyam NEWS

ఏపిలో పెయిడ్ ఆర్టిస్టుల గందరగోళం

Satyam NEWS

ఆది పినిశెట్టి ‘క్లాప్’ షూటింగ్ పునఃప్రారంభం

Sub Editor

Leave a Comment