36.2 C
Hyderabad
April 25, 2024 19: 40 PM
Slider సంపాదకీయం

ప్రభుత్వ ఉద్యోగులపై ఉక్రోషం చూపిస్తున్న జగన్ ప్రభుత్వం

#YSJaganmohanReddy

అత్త కొట్టినట్లు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్న చందంగా ప్రవర్తిస్తున్నది వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.

లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు తేవడం తో బాటు అవాంఛనీయమైన షరతులకు అంగీకారం తెలుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ సమాచారం లీక్ అయిందని బాధ పడుతున్నది.

ఈ బాధను ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా తీర్చుకుంటున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక డేటాను మీడియాకు లీక్‌ చేశారని ఆర్థిక శాఖలోని ముగ్గురు అధికారులను ఇవాళ ఉదయం రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

తాజాగా ఇబ్రహీంపట్నం CFMS కార్యాలయంలో పనిచేస్తున్న మరో 10 మంది ఉద్యోగులను ఇదే కారణంతో సస్పెండ్‌ చేయడంతో ఉద్యోగుల్లో కలకలం మొదలైంది.

ఇప్పటికే మీడియాపై అనధికారికంగా తీవ్రమైన ఆంక్షలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని తొక్కి పెట్టేందుకే ప్రాధాన్యతనిస్తున్నది. సోషల్ మీడియా ద్వారా తమకు అనుకూలమైన సమాచారం మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక అంశాలన్నీ మీడియాకు లీక్‌ అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులపై తన ప్రతాపాన్ని చూపడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారం బయటకు ఇస్తున్నారన్న ప్రభుత్వ అభియోగం సమర్థనీయం కాదు.

అలా బయటకు వచ్చిన సమాచారం తప్పయితే చర్యలు తీసుకోవచ్చు కానీ ఉద్యోగులపై వేటు వేయడం సహించరాని అంశం. డేటా చాలా పక్కాగా మీడియాలో రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు, మంత్రులు స్వయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, అప్పులు చేయక తప్పడం లేదని బహిరంగంగా అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ కోపం అంతా ఉద్యోగులపై తీర్చుకోవడం అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లుగా భావించాల్సి వస్తుంది. ఒక్కరోజే 13 మందిపై చర్యలు తీసుకోవడం ఏ రకంగా సమర్థనీయమో ప్రభుత్వమే చెప్పుకోవాలి.

Related posts

మేడ్చల్ నుంచి పోటీ

Bhavani

తెలుగు తేజం

Satyam NEWS

“అమ్ముంటే చాలంటూ…..”

Satyam NEWS

Leave a Comment