35.2 C
Hyderabad
April 24, 2024 13: 00 PM
Slider విజయనగరం

లేడీ ఎస్పీ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా పోలీసు శాఖకు మరో జాతీయ పురస్కారం

#VijayanagaramPolice

విజయనగరం జిల్లా కు డైరెక్ట్ ఎస్పీగా రాజకుమారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అటు శాఖను ఇటూ శాఖా సిబ్బందిని పనితీరు లో నైపుణ్యం చూపించేలా బాధ్యతలను నిర్వహించారు.

ప్రత్యేకించి….ఎస్పీ చేపట్టిన చర్యలు, చేసిన పనితీరుకు సిబ్బంది సహితం స్పూర్తి ని పొంది మరింత వేగంగా తమతమ పనితనాన్ని చర్యల్లో చూపించారు.

ఈ క్రమంలో మహిళల భద్రతకు చేపట్టిన చర్యలు, నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకు గాను స్కాచ్ అవార్డు (సిల్వర్) లభించింది.

స్కాచ్ జ్యూరీ ఎదుట జిల్లా పోలీసుశాఖ చేపట్టిన చర్యలను విజయనగరం జిల్లా ఎస్పీ  రాజకుమారి ఆన్ లైనులో వివరించారు.

జ్యూరీ సభ్యులు జిల్లా పోలీసుశాఖ చర్యల పట్ల,ఎస్పీ ఆన్ లైన్ లో చెప్పిన అంశాల పట్ల  సంతృప్తి చెందారు. వెను వెంటనే స్కాచ్ జాతీయ అవార్డు (రజతం) కు ఎంపిక చేసినట్లుగా ప్రకటించారు.

సో హేట్సాఫ్…ఎస్పీ రాజకుమారీ.

Related posts

ఆ క‌లెక్ట‌ర్‌కు మొక్క‌లంటే, ప‌చ్చ‌ద‌న‌మెంతో ఇష్టం!

Sub Editor

Wuhan disaster: దుష్ట చైనా దే ఈ మహాపాపం

Satyam NEWS

అభాగ్యులకు అండగా దేవాడ గ్రామస్తులు

Satyam NEWS

Leave a Comment