26.2 C
Hyderabad
November 3, 2024 21: 09 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

15 మంది ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల డిస్మిస్

thZ7AZHH9A

ఆదాయపు పన్ను శాఖలో అవినీతి అధికారుల ఏరివేతలో భాగంగా నేడు మరో 15 మందిని డిస్మిస్ చేశారు. ఆదాయపు పన్నుల శాఖ లో పేరుకు పోయిన అవినీతిని ప్రక్షాళన చేయాలని ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలు ఇచ్చిన నాటి నుంచి అవినీతిపరులైన అధికారుల ఏరివేత కొనసాగుతున్నది. సీరియస్ అవినీతి ఆరోపణలు  ఉన్న ఆదాయపు పన్ను విభాగం అధికారులను గుర్తించి ఒక్కొక్కరిపై వేటు వేస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు దఫాలుగా 49 మంది ఆదాయపు పన్ను శాఖ ఉన్నత స్థాయి అధికారులను డిస్మిస్ చేశారు. 12 మంది అవినీతి పరులను పదవులు వదిలిపెట్టి వెళ్లిపోయాలని ముందుగా ఆదేశించారు. ఆ తర్వాత ఏరివేత ప్రారంభించారు. ప్రధాని ఆదేశాలతో జూన్ 10 నుంచి అవినీతి ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఏరివేతను ప్రారంభించారు. 22 మంది అధికారులకు పింక్ స్లిప్ లు కూడా ఇచ్చారు. నేడు డిస్మిస్ చేసిన అవినీతి అధికారులలో ఒక ప్రిన్సిపుల్ కమిషనర్ స్థాయి వ్యక్తి కూడా ఉన్నారు

Related posts

పులిచింతలకు చేరుకున్న స్టాప్‌ లాక్‌ నిపుణుల బృందం

Satyam NEWS

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

Bhavani

Hats off: అవయవ దాత కు ఘన సన్మానం

Satyam NEWS

Leave a Comment