27.7 C
Hyderabad
April 20, 2024 02: 30 AM
Slider ముఖ్యంశాలు

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

#APHighCourt

రోజులు మారిపోయినాయని సంతోష పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో పెను దెబ్బ తగిలింది. అమరావతి రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ సీఐడీ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది.

కిలారు రాజేష్‌తో పాటు మరికొంత మంది రాజధానిలో భూములు ముందుగానే కొనుగోలు చేశారని సీఐడీ కేసులు నమోదు చేసింది.

రాజధానిలో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసింది. భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ప్రభుత్వం కక్షసాధిస్తోందని పేర్కొంటూ కిలారు రాజేష్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు.

పిటిషనర్ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు.

ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరగలేదని పేర్కొంటూ దీనికి ఐపీసీ సెక్షన్లకు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది.

Related posts

ఉత్తర నక్షత్ర పూజ: స్వామి యే శరణం అయ్యప్ప

Satyam NEWS

వనపర్తిలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం

Satyam NEWS

అంబేద్కర్ చిత్రాన్ని అపహాస్యం చేసిన సాక్షి పై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment