అనంతపురం జిల్లా కదిరిలో మరో ఘోరం జరిగింది. కదిరి పట్టణంలోని వలిసాబ్ సాబ్ రోడ్డుకు చెందిన రెండవ తరగతి చదువుతున్న 8 సం ల చిన్నారిపై జగదీష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు చిన్నారి తల్లి పేర్కొంది. చిన్నారి తల్లి తెలిపిన వివరాల మేరకు రాయలసీమ సర్కిల్ లో మదరసా సగ భాగం, మరో సగ భాగం లో మణప్పరం గోల్డ్ ఫైనాన్స్ కార్యాలయం ఉంది.
చిన్నారి ఉర్దూ ట్యూషన్ కు ఒక సంవత్సరం నుండి పంపుతున్నారు. రోజూ వెళుతున్నట్లు ఈ రోజు కూడా ట్యూషన్ కు వెళ్ళింది. మణప్పరం గోల్డ్ ఫైనాన్స్ లో సెక్యురిటి గా పనిచేస్తున్నా ఖయ్యూమ్ అనే వ్యక్తి ఇంట్లో పండుగ కారణంగా ఇంటికి వెళ్లాడు. జగదీష్ సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నాడు. ఒంటరిగా ఉన్న చిన్నారి పై జగదీష్ అత్యాచారానికి పాల్పడ్డాడని, భయంతో ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసిందని చిన్నారి తల్లి తెలిపింది.
తాము పట్టుకోవడానికి వెళ్లే సమయానికి జగదీష్ పారిపోయాడని ఆమె తెలిపింది. ఈ విషయం పై కదిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని జగదీష్ కోసం గాలిస్తుమని పట్టణ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.