34.2 C
Hyderabad
April 19, 2024 20: 40 PM
Slider హైదరాబాద్

ఎన్టీవీ ఎడిటర్ సుందరరామ శాస్త్రి పై మరో ఫిర్యాదు

#cybercrime

ఎన్టీవీ చైర్మన్ గా ఉన్న తుమ్మల నరేంద్ర చౌదరి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో చేసిన అక్రమాలు, అవినీతికి సంబంధించిన అంశాలపై వార్తలు రాస్తున్నందున గత కొన్ని నెలలుగా తనను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ తెలుగుగేట్ వే.కామ్ ఎడిటర్ వాసిరెడ్డి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇందులో భాగంగానే తన పేరుతో నకిలీ ఐడి క్రియేట్ చేసి TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్ పై అవాకులు చవాకులు రాసి తన పేరుతో ప్రచారం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన నకిలీ ఐడితో రవి ప్రకాష్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్ల తాను సమాధానం చెప్పుకోవాల్సి వస్తున్నదని ఆయన అన్నారు. తనను మళ్లీ జైల్ కు పంపుతారంటూ వాసిరెడ్డి శ్రీనివాస్ పేరుతో రాసిన ఒక వార్తను ఎన్టీవీ ఎడిటర్ సుందరరామ శాస్త్రి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని ఆరోపిస్తూ TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా వాసిరెడ్డి శ్రీనివాస్ ఇదే అంశంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఆయన చేసిన ఫిర్యాదు పూర్తి పాఠం:

సబ్జెక్ట్: ఫేక్ ఐడీతో ఎన్టీవీ ఎడిటర్ వీఎస్ఆర్ శాస్త్రి తప్పుడు వార్తల ప్రచారం

సర్.. నా పేరు వాసిరెడ్డి శ్రీనివాస్. తెలుగుగేట్ వే.కామ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నాను. ఎన్టీవీ న్యూస్ ఛానల్ ఎడిటర్ గా ఉన్న వీఎస్ఆర్ శాస్త్రి నా పేరు మీద ఫేక్ ఐడీ క్రియేట్ చేయటంతోపాటు.. నా వెబ్ సైట్ తెలుగుగేట్ వే లోగోను ఉపయోగించి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై అసత్య కథనాన్ని ప్రచారంలోకి తెచ్చారు.

మళ్ళీ కటకటాల వెనక్కి రవిప్రకాష్, రవిప్రకాష్ బెయిల్ రద్దు కాబోతుంది అంటూ అసత్య కథనాన్ని డెయిలీహంట్ లో పోస్ట్ చేయించారు. కోర్టు విచారణ పరిధిలో ఉన్న అంశాలతో అసత్య కథనాలతో పాటు రవిప్రకాష్ ఫోటోలు కూడా పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు.

నాకు కానీ తెలుగు గేట్ వేకు కానీ డెయిలీ హంట్ తో ఎలాంటి ఒప్పందాలు లేవు. డెయిలీ హంట్ లో నా పేరుతో, నా లోగోతో తప్పుడు కథనాన్ని ప్రచురించటంతో పాటు.. ఆ వార్తను వీఎస్ఆర్ శాస్త్రి పలు మీడియా వాట్సప్ గ్రూపుల్లో ఆగస్టు 8, 9 తేదీల్లో విరివిగా షేర్ చేశారు. లేటస్ట్ న్యూస్ అప్ డేట్స్ అనే వాట్సప్ గ్రూప్ లోనూ వీఎస్ఆర్ శాస్త్రి ఈ తప్పుడు వార్తను స్వయంగా పోస్ట్ చేశారు.

దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా ఫిర్యాదుకు జత చేస్తున్నాను. అదే సమయంలో ఆ వార్తలో ఉన్న కంటెంట్, తర్వాత డెయిలీ హంట్ లో వార్త తొలగింపునకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా జత చేస్తున్నాను. వీఎస్ఆర్ శాస్త్రి మొబైల్ నెంబర్ 90102 34399తో ఇది వాట్సప్ గ్రూపుల్లో సర్కులేట్ అయింది.

ఇదే విషయంపై రవిప్రకాష్ కు చెందిన వ్యక్తులు ఫోన్ చేసి నన్ను ఆరా తీయగా.. నా వెబ్ సైట్ లో అలాంటి వార్త పబ్లిష్  చేయలేదని.. దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదని వివరించటం జరిగింది. అసలు విషయం తెలుసుకున్న రవిప్రకాష్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇదే అంశంపై ఫిర్యాదు చేయటం జరిగింది.

ఎన్టీవీ చైర్మన్ గా ఉన్న తుమ్మల నరేంద్ర చౌదరి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో చేసిన అక్రమాలు, అవినీతికి సంబంధించిన అంశాలపై నాకు వచ్చిన సమాచారం ఆధారంగా వార్తలు రాస్తున్నందునే గత కొన్ని నెలలుగా నన్ను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేస్తున్నారు.

సహజంగా ఓ ప్రధాన ఛానల్ లో ఎడిటర్ స్థాయిలో ఉన్న వారు ఇలా వాట్సప్ గ్రూపుల్లో వార్తలు పేర్ చేయరు. వాళ్లకు పెద్ద టీమ్ ఉంటుంది. కానీ ఓ ఎడిటర్ ఇలా ఫేక్ ఐడీతో.. తప్పుడు వార్తలు షేర్ చేశారు అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్లే కన్పిస్తోంది.

స్వయంగా ఎన్టీవీ ఎడిటర్ వీఎస్ఆర్ శాస్త్రి తప్పుడు వార్తలు నా పేరు, నా వెబ్ సైట్ పేరును జత చేసి, ఫేక్ ఐడీలతో తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని పరిశీలించి, విచారణ జరిపించి వీఎస్ఆర్ శాస్త్రితోపాటు డెయిలీ హంట్ పై కూడా తగు చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను.

వాసిరెడ్డి శ్రీనివాస్

Related posts

కొనుగోలు కేంద్రం పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

Satyam NEWS

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దిగజారిన కేసీఆర్

Satyam NEWS

ఓ దిశ నువ్వెక్కడ: జీవోలు ఇవ్వడమే తప్ప ఆచరించడం శూన్యం

Satyam NEWS

Leave a Comment