27.7 C
Hyderabad
April 25, 2024 09: 17 AM
Slider జాతీయం

మళ్లీ దేవుడిని అవమానించిన లీనా మణిమేకలై

#lenamanimekalai

హిందూ దేవుళ్లను అవమానించడం నిత్యకృత్యమైపోయింది. వద్దని చెబుతున్న కొద్దీ ఈ ట్రెండ్ ఎక్కువ కావడం ఫ్యాషన్ అయిపోయింది. ‘కాళి’ అనే డాక్యుమెంటరీ నిర్మిస్తున్న లీనా మణిమేకలై అనే మహిళామణి కాళికామాత చేతిలో స్వలింగ సంపర్కుల జెండా పెట్టి, మరో చేత్తో సిగరెట్ తాగుతున్నట్లు పోస్టర్ విడుదల చేసింది.

దానిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అయింది. కాళికా దేవిని ఇంత తీవ్రంగా అవమానించిన లీనా మణిమేకలై పై దేశంలోని పలు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేశారు. ఆమెను తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఫిర్యాదుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వివాదం చెలరేగుతుండగానే లీనా మణిమేకలై బరితెగించి మరో వివాదాస్పద ట్విట్ చేశారు.

లీనా తన సోషల్ మీడియా ఖాతాలో శివుడు మరియు తల్లి పార్వతి పాత్రను పోషిస్తున్న నటీనటుల చిత్రాన్ని పంచుకుంది. ఈ చిత్రంలో, శివుడు మరియు తల్లి పార్వతిగా నటించిన నటీనటులు ఇద్దరూ ధూమపానం చేస్తున్నారు. ఫోటోను పోస్ట్ చేస్తున్నప్పుడు, లీనా ‘మరెక్కడో’ అని రాసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లీనా మణిమేకలై పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది.

(మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు సత్యంన్యూస్ ఆ నాటి కాళి వాల్ పోస్టర్ ను పోస్టు చేయలేదు. ఇప్పుడు మరీ శృతిమించినందున లీనా తాజా ఫొటోను పోస్టు చేస్తున్నాము. ఇది లీనా వికృత ఆలోచన వివరించి చెప్పేందుకే తప్ప హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు కాదు)

Related posts

మంత్రి పెద్దిరెడ్డి ప్రాణాల విలువ తెలియని రాక్షసుడు

Satyam NEWS

దీర్ఘ కాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే భూముల రీ స‌ర్వే

Satyam NEWS

స్పందన ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి

Satyam NEWS

Leave a Comment