ఈ నెల 8 వరకు 18 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, సిక్కిం, బీహార్, మధ్యప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో అతలాకుతలమయ్యాయి. ఈ భారీ వర్షాల నుండి ఇంకా తెలుకోనేలేదు..ఇప్పుడు మళ్లీ వర్షాలు అనే మాట రెండు రాష్ట్ర ప్రజలను ఖంగారు పెట్టిస్తున్నాయి.
previous post
next post