అధికార పార్టీకి చెందిన వారికి ఇది వార్త కాకపోవచ్చు కానీ మరో అమరావతి రైతు బ్రెయిన్ హెమరేజ్ తో మరణించాడు. తుళ్లూరుకు చెందిన కంచర్ల చంద్రం అనే 43 ఏళ్ల వయసు ఉన్న ఈ రైతు గత కొద్ది రోజులుగా రాజధాని అమరావతిపై ఏం జరుగుతుందోననే వత్తిడిలో ఉన్నాడు. ల్యాండ్ పూలింగ్ లో తనకు జీవనాధారమైన 31 సెంట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చేశాడు. ఇప్పుడు భూమి పోయింది. ప్రభుత్వం డెవలప్ చేసి ఇస్తుందో లేదో తెలియదు.
సాగులేదు. ఏం చేయాలి? ఇదే ఆలోచనతో అతని కి బ్రెయిన్ హెమరేజ్ వచ్చింది. తల లోపలి నరాలు చిట్లి అతను మృతి చెందాడు. అంత మాత్రానికే చచ్చిపోతారా? అతనికి వేరే ఏవో ఇబ్బందులు ఉండి చచ్చిపోయి ఉంటాడు అని ప్రభుత్వం కచ్చితంగా చెబుతుంది. చంద్రం చచ్చిపోవడానికి కారణం అమరావతి కాదు అని ఈపాటికే రాసేసుకోని ఉంటారు. అయినా ఇది వార్తే. అందరూ తెలుసుకోవాల్సిన వార్తే. మనసున్న వారు బాధపడే సందర్భమే.