దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండీలో అగ్ని ప్రమాదం జరిగి 44 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. నేడు పీరాగర్హీలోని ఓ బ్యాటరీ ఫ్యాకర్టీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీలు లీక్ అవ్వడంతో ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి, భారీగా మంటలు వ్యాపిస్తున్నాయి.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 35 ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అక్కడి ప్రజలను పోలీసులు దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.