తిరుమల శ్రీవారికి మరో భారీ బంగారు కానుక దక్కింది. మాజీ ఎంపి, దివంగత డికే ఆదికేశవులు నాయుడు మనవరాలు తేజస్వీ సుమారు 2 కోట్లు విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను శ్రీవారికి కానుకగా ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ బీ ఆర్ నాయుడు చేతుల మీదుగా తేజస్వీ ఈ కానుకను శ్రీవారికి అందచేశారు. ఈ వైజయంతీ మాలను ఉత్సవమూర్తులకు అలంకరించనున్నారు. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా మరో వైజయంతీ మాలను రేపు తేజస్వీ విరాళమివ్వనున్నారు.
previous post