పారిస్ ఒలింపిక్స్ లొ భారత్ కు మరో కాంస్య పతకం దక్కింది. 10మీ. ఎయిర్ పిస్టల్ షూటింగ్లో మిక్స్డ్ విభాగంలో మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ బ్రాంజ్ మెడల్ కొల్లగొట్టారు. భారత్‌కు చారిత్రక పతకం అందించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న మను భాకర్ మరో మెడల్‌పై గురి పెట్టి సక్సెస్ అయింది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరభ్‌జోత్ సింగ్ జోడీగా మను కాంస్య పోరుకు చేరుకుని పతకం సాధించింది. సోమవారం జరిగిన 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్-సరభ్‌జోత్ సింగ్ జోడీ పాయింట్ తేడాతో గోల్డ్ కొల్లగొట్టే గొప్ప అవకాశాన్ని కోల్పోయింది.
క్వాలిఫికేషన్ రౌండ్‌లో మను-సరభ్‌జోత్ మొత్తం 580 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచారు. 579 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన కొరియా జోడీతో మను ద్వయం మంగళవారం జరిగే కాంస్య పోరు ప్లేఆఫ్స్‌లో తలపడింది. తొలి రెండు సిరీస్ లో భాకర్ 98 పాయింట్లతో అదరగొట్టినా.. మూడో సెట్‌లో 95 పాయింట్లు మాత్రమే స్కోరు చేసింది. అయితే, సింగ్ 95, 97, 97 పాయింట్లు సాధించాడు. తొలి సెట్‌లో సరభ్‌జోత్ తక్కువ పాయింట్లు స్కోరు చేయడంతో గోల్డ్ మెడల్ పోరుకు చేరుకొని.. కనీసం రజతం ఖరారు చేసుకొనే అవకాశాన్ని భారత్ చేజార్చుకొంది. చివరకు కాంస్య పతకం దక్కింది.