29.2 C
Hyderabad
September 10, 2024 17: 33 PM
Slider ప్రత్యేకం

చంద్రబాబుకి జై కొట్టిన మరో వైసీపీ ఎమ్మెల్సీ

#YSJaganMohanReddy

వైఎస్ఆర్ సీపీలోని నేతలు ఎప్పుడెప్పుడు పార్టీని వదిలించుకుందామా అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. జగన్ ను అంటిపెట్టుకుని ఉండేవారి సంగతి పక్కన పెడితే, ఎంతో మంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గెలిచిన వారు, ఇతర నేతలు కూటమిలోకి వెళ్లాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకే చాలా మంది కొంత కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు.

నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇకపై జగన్ రెడ్డితో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గ్రహించి.. ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు.జగన్ అధికారం కోల్పోయాక వైసీపీ నేతలంతా నిరాశ పడిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడలేని వారంతా ఇప్పుడు క్రమంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఓటమికి జగన్ విధానాలే కారణమనే ఆలోచన వచ్చేలా మాట్లాడుతున్నారు.

తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పద్మశాలి కుల వృత్తుల తరఫున వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం విజయవాడ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వీవర్స్ కు జీఎస్టీ లేకుండా కేంద్రంతో మాట్లాడి తీసేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చేనేతలకు మగ్గాలు లేని వారికి సొంత ఇల్లు నిర్మిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీకి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఈ అంశం మంగళగిరిలో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే ఎంతో వైసీపీ నేతలు టీడీపీ లేదా జనసేన పార్టీలోకి వెళ్దామని ప్రయత్నిస్తూ సరైన సమయం కోసం వేచి చూస్తున్న వేళ.. ఎమ్మెల్సీ మురుగుడు తెలుగుదేశంలోకి చేరుతారని చర్చ మొదలయింది. ఎందుకంటే మురుగుడు హనుమంతరావు మంగళగిరిలో నారా లోకేశ్ పాల్గొన్న కల్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే ఆయనతోపాటే పాల్గొన్నారు. అదే వేదిక మీద నుంచి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించడంతో జగన్‌కు షాక్ తగులుతోంది.

టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకునే మురుగుడు హనుమంతరావు ఇలా మాట్లాడుతున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. తొలుత కాంగ్రెస్ నేతల అయిన హనుమంతరావు గతంలో ఓసారి టీడీపీలో చేరి .. తర్వాత మళ్లీ వైసీపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో చివరి క్షణంలో మురుగుడు హనుమంతరావు కోడలు, కాండ్రు కమల కుమార్తె అయిన లావణ్యకు వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. అయితే ఆమె లోకేశ్ కు కనీస పోటీ కూడా ఇవ్వలేకుండా 90 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Related posts

మత సామరస్యాన్ని ప్రతీక రంజాన్: మేడా బాబు

Satyam NEWS

4276 చెక్కులకు గాను రూ. 18.58 కోట్లు పంపిణీ

Murali Krishna

ట్యాంక్ బండ్ పై భగీరథుడి విగ్రహం

Satyam NEWS

Leave a Comment