37.2 C
Hyderabad
March 28, 2024 18: 18 PM
Slider విజయనగరం

కళలకు కాణాచి విజయనగరంలో అడుగు ముందుకు

#VijayanagaramMunicipality

కళలకు కాణాచి అయిన విజయనగరం సాంస్కృతిక రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మరింత గా జిల్లా ప్రభావాన్ని మరింతగా ఉన్నత స్థాయికి తీసుకెళుతోంది.

ఈ మేరకు నగరంలో అందుకు సంబంధించి ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఎంటర్ట్నైన్ మెంట్ నిర్వహణ సంస్థ… ప్రత్యేక లోగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని రెవిన్యూ హోమ్ లో ఏర్పాటు చేసింది.

ఆ లోగోను వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కోలగట్ల శ్రావణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి షార్ట్ ఫిలిమ్స్ తోపాటు, యూట్యూబ్ చానల్స్ కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆమె అన్నారు.

గతంలో ఈ సంస్థ ఆధ్వర్యంలో సామాజిక దృక్పథం గల షార్ట్ ఫిల్మ్ లు తీయడం, ప్రేక్షకుల అభిమానం పొంది అవార్డులు రావడం ఎంతైనా అభినందనీయమన్నారు. ఇటువంటి సంస్థలు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడంవల్ల జిల్లాలో ఉండే కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించే విధంగా అవకాశం ఉంటుందన్నారు.

సంస్థ ద్వారా  సమాజానికి చక్కటి సందేశం ఇచ్చే విధంగా షార్ట్ ఫిలిం లు తీయాలని ఆమె నిర్వాహకులతో అన్నారు. కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది ఒక వేదిక అని అన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ నారాయణం శ్రీనివాసరావు, ప్రముఖ రంగస్థల నటుడు వై సత్యం మాస్టారు, ఎన్జీవో మోహన్  తదితరులు మాట్లాడారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు ముఖ్య అతిధులను శాలువాతో, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా కళాకారులు ఈ ఆడిషన్స్ లో పాల్గొన్నారు.

Related posts

కరోనా సమయంలో సేవలు అందించిన R.M.P,P.M.Pలను గుర్తించాలి

Satyam NEWS

ప్రజావాణిలో వెల్లువలా వచ్చిపడిన ఫిర్యాదులు

Satyam NEWS

రూ. 410 కోట్లతో సర్వాంగ సుందరంగా మానేరు రివర్ ప్రంట్

Satyam NEWS

Leave a Comment