రాహుల్ ద్రావిడ్ ను ది వాల్ అనే వారు క్రికెట్ అభిమానులు ప్రేమగా. వన్డే అయినా టెస్టు క్రికెట్ అయినా ద్రావిడ్ ఉన్నాడంటే అదో భరోసా. ఎవరు ఫెయిల్ అయినా రాహుల్ ఫెయిల్ కాడని. రాహుల్ ద్రావిడ్ ఇచ్చే సపోర్టుతో క్రీజ్ లో ఉన్న అతని పార్టనర్లు చెలరేగి పోవచ్చు. రాహుల్ ద్రావిడ్ ను అవుట్ చేయడం కష్టం. ద్రావిడ్ రిటైర్ అయిన తర్వాత ఆ స్థానం ఖాళీగా ఉండిపోయింది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఆ స్థానం ఫుల్ అయింది. రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని భర్తీ చేసినవాడు మన తెలుగు ప్లేయర్ హనుమ విహారి. సుస్థిరంగా బ్యాటింగ్ చేస్తూ భారత క్రికెట్ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాడు హనుమ విహారి. భిన్నమైన వాతావరణంలో విభిన్న శైలిలో ఆడగలిగే క్రికెటర్ ప్రస్తుతం ఎవరైనా వున్నారా అంటే హనుమ విహారి పేరే చెప్పవలసి వుంటుంది. క్రైసిస్ మేనేజ్‌మెంట్ లో అతడికతడే సాటి ! ఆట మొదలైన తర్వాత అతడిని మిడిల్ ఆర్డర్ లోనే పంపాలి తప్ప టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గా పంపకూడదని ఎప్పుడో డిసైడయిపోయారు. జయాన్ని సొంతం చేసుకోవాలనుకుని ఏ కెప్టెన్ అనుకోడు? హనుమ విహారి వుంటే అంత నిశ్చింత మరి! విజృంభణ కు మారు పదం హనుమ విహారి. అటు బ్యాట్ తోను..ఇటు బాల్ తోను హనుమంతుడి మాదిరిగా చెలరేగిపోతాడు. వెస్టిండీస్ తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో 93 రన్స్ కు అవుట్ అయిన హనుమ విహారి నిరాశ చెందలేదు. మీడియా పట్టించుకోకపోయినా బేలగా మారలేదు. రెండో టెస్టు మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ లలో 93, 111 రన్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. తొలి శతకం చేయడంతో హనుమ విహారి ప్రపంచం దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు హనుమ విహరిపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఇయాన్ బిషప్ మన హనుమ విహారి గురించి ఎంతో విలువైన మాట చెప్పాడు. హనుమ విహారి ఓపిక వల్లే ఇది సాధ్యం అవుతున్నదన్నాడు. నిజంగా నిజం ఇది. హనుమ విహారికి ఓపిక ఎక్కువ. టెస్టుల్లో సాధించిన తొలి శతకాన్ని తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు హనుమ విహారి ప్రకటించాడు. ఇదే సందర్భంలో తాను సెంచరీ చేసేందుకు సహకరించిన పేసర్ ఇషాంత్ శర్మకు కృతజ్ఞతలు తెలిపాడు.ఆట ముగిశాక విహారి మాట్లాడుతూ ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. నాకు 12 ఏళ్లున్నప్పుడు మా నాన్న చనిపోయారు. అంతర్జాతీయ క్రికెట్‌లో నమోదు చేసే తొలి సెంచరీని ఆయనకు అంకితం ఇవ్వాలని అప్పుడే నేను నిర్ణయించుకున్నా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా సంతోషించి ఉంటారు అని పేర్కొన్నాడు. దటీజ్ హనుమ విహారి.
previous post