మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. లంగర్ హౌస్ ప్రాంతంలో నివసించే సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ కండక్టర్ ఈ ప్రయత్నం చేయడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపుగా 14 సంవత్సరాలుగా ఆర్టీసీకి సేవలు అందిస్తున్న సురేందర్ గౌడ్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు. ఈ నెల జీతం రాకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. చెక్ బౌన్సు అయిన విషయాన్ని ఫైనాన్సర్ ఫోన్ చేసి చెప్పాడు. దాంతో సురేందర్ గౌడ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆర్టీసీ యాజమాన్యం జీతం ఇవ్వకపోవడం వల్లే ఈ విధంగా జరిగిందని వాపోయాడు. మనస్థాపాన్ని తట్టుకోలేక సురేందర్ గౌడ్ పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రిలో చేర్చారు. ఇక ఆర్టీసీ ఉద్యోగం పోయినట్లేనని భావించి మళ్లీ రాదని ఆందోళన చెంది అతడు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. సున్నిత మనస్కులైన ఆర్టీసీ కార్మికులు ఈ విధంగా ఒక్కొక్కరే ఆత్మహత్యా ప్రయత్నం చేయడం తీవ్రంగా కలచివేస్తున్నది.
previous post