36 C
Hyderabad
May 13, 2025 11: 33 AM
Slider ముఖ్యంశాలు

మరో మూడు రోజుల పాటు ముసురే

rains in ap

రాగల మూడు రోజులలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకి వెళ్ళే కొద్దీ నైఋతి వైపుకు వంపు తిరిగి ఉన్నది. రాగల 48 గంటలలో ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగా తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు అనేక చోట్ల రేపు, ఎల్లుండి చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర లో రాగల మూడురోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అదే విధంగా రాగల మూడురోజులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు కొన్నిచోట్ల రేపు, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Related posts

27 న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయండి

Satyam NEWS

కోవిడ్ 19 నిబంధనలు అందరూ పాటించాల్సిందే..

Satyam NEWS

సేవ్ ఆంధ్రప్రదేశ్:అమెరికాలోనూ అమరావతి ఆందోళనలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!