26.7 C
Hyderabad
May 1, 2025 04: 37 AM
Slider తెలంగాణ

ఈఎస్ఐ మందుల కుంభకోణంలో మరో ముగ్గురి అరెస్టు

esi medical scam

ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ స్కాం లో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో తేజ ఫార్మా ఎండి రాజేశ్వర్ రెడ్డి, చర్లపల్లి ఫార్మాసిస్ట్ లావణ్య, వరంగల్ జేడీ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పాషా ఉన్నారు. ప్రవేట్ హాస్పిటల్ కు మందులు తరలించార న్న ఆరోపణలు వీరిపై ఉన్నట్లు  ఏసీబీ అధికారులు తెలిపారు. మందుల కొనుగోలులో రాజేశ్వర్ రెడ్డి రూ.28 కోట్ల మేరకు అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. గతంలో అరెస్టు అయిన వెంకటేశ్వర హెల్త్ కేర్ ఎండీ అరవింద్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కుంభకోణంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడి అల్లుడి ప్రమేయం ఉందని ప్రాధమిక నిర్ధారణకు వచ్చి ఏసీబీ అధికారులు మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

Related posts

22 వ తేదీన‌ బొడికొండ రామ‌తీర్దం ఆల‌య పున‌: ప్రారంభం

Satyam NEWS

పవన్ కల్యాణ్ కూడా నిన్ను కాపాడలేరు బాలినేనీ

Satyam NEWS

ముత్యపు కవచంలో శ్రీ మలయప్ప అభయం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!