34.2 C
Hyderabad
April 19, 2024 21: 27 PM
Slider ప్రత్యేకం

జ్ఞాన్వాపి మసీదు లోని శివలింగాన్ని పూజించే అవకాశం కల్పించండి

#mahanth

జ్ఞాన్వాపి మసీదు వజుఖానాలో కనుగొనబడిన శివలింగాన్ని పూజించేందుకు తనకు అనుమతినివ్వాలని వారణాసి శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయ మాజీ మహంత్, డాక్టర్ తివారీ కోరారు. ఈ మేరకు ఆయన కోర్టును ఆశ్రయించారు. భోగ్, హారతి తో శివలింగాన్ని పూజించాలంటూ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.

గత కేసులతో పాటు ఈ కేసు కూడా కోర్టులో విచారణకు రానుంది. జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంతాన్ని మహంత్ కుటుంబానికి చెందిన ఆస్తిగా ఆయన గతంలో పేర్కొన్నారు. తమ పూర్వీకులు బాబా శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయానికి మహంత్‌గా పనిచేసేవారని మహంత్ పిటిషన్‌లో పేర్కొన్నారు. మహంత్ కైలాష్ పతి తివారీ మరణానంతరం డాక్టర్ వీసీ తివారీ బాబాకు సేవ చేయడం ప్రారంభించారు.

దరఖాస్తుదారుడి పూర్వీకుల ప్రకారం, 1669 నుండి 1700 వరకు, ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించారు.1669 ADలో ఔరంగజేబు శాసనం తర్వాత విశ్వేశ్వరాలయాన్ని మొఘల్ సైన్యం కూల్చివేసిందని పూర్వీకులు చెప్పారు. ఆ సమయంలో జ్యోతిర్లింగానికి ఎటువంటి నష్టం జరగకూడదని జ్ఞానవాపి కుండ్‌లోకి దాన్ని ప్రతిష్టించారని తెలిపారు.

అక్కడి నంది విగ్రహాన్ని పగలగొట్టేందుకు మొఘల్ సైన్యం ప్రయత్నించింది. బాబా విశ్వేశ్వరనాథ్ నివసించే ప్రదేశాన్ని జ్ఞాన్వాపి బావి అని పిలుస్తారు. దీనిని ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు అని పిలుస్తున్నారు. అహల్యాబాయి బాబా కాశీ విశ్వనాథ ఆలయాన్ని పూజించే హక్కును తన పూర్వీకులకు కల్పించారని డాక్టర్ తివారీ తెలిపారు.

అటువంటి పరిస్థితిలో, జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో కనిపించే శివలింగాన్ని పూజించడం, స్నానం చేయడం, హారతి చేయడం మరియు శుభ్రపరచడం వంటి హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

Related posts

ఉద్యమకారునికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన కార్పొరేటర్ శ్రీదేవి

Bhavani

మహావీర్ ఇంజనీరింగ్ సర్వీస్ ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

రఘురామ డిమాండ్: వివేకా మర్డర్ కేసులో విజయసాయిని ప్రశ్నించాలి

Satyam NEWS

Leave a Comment