అమరావతి నుంచి కార్యాలయాలు తరలింపును సవాల్ చేస్తూ హైకోర్టు లో మరో రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అమరావతి నుంచి కర్నూలుకి విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, కమిషనర్ ఆఫ్ ఎన్ క్వైరీస్ కార్యాలయం తరలిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 13 జారీ చేసిన విషయం తెలిసిందే.
దీన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఇంద్రనీల్ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఇదే జీవోను సవాల్ చేస్తూ న్యాయవాదులు లక్ష్మి నారాయణ, అంబటి సుధాకర్ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. న్యాయమూర్తి లంచ్ మోషన్ పిటిషన్లను విచారణకు అనుమతించారు.