33.2 C
Hyderabad
March 26, 2025 11: 04 AM
Slider సినిమా

కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ఈ గీతం అంకితం

#Hero Lohith

కరోనాను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కరినీ శ్లాఘిస్తూ, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ.. ప్రముఖ నటుడు లోహిత్ మరో వీడియో సాంగ్ రూపొందించారు. ఈ వీడియో సాంగ్ ను హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ సివిల్ సప్లయిస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించి లోహిత్ ను అభినందించారు. 

ఈ సందర్భంగా లోహిత్ మాట్లాడుతూ..”కరోనా మహమ్మారి మనల్ని వణికిస్తున్న సమయంలో ‘నేనున్నాను’ అని భరోసా కల్పించిన ముఖ్యమంత్రి కేసిర్ కి ధన్యవాదాలు. వారిచ్చిన దిశానిర్దేశంతో ముందుకు కదిలిన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మేయర్ బొంతు రామ్మోహన్, సివిల్ సప్లయిస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, GHMC కార్పోరేటర్ లు, పోలీసులు , డాక్టర్ లు, పారిశుధ్య కార్మికులతో సమానంగా   ప్రాణాలను లెక్కచేయక అన్ని రకాలుగా ప్రజలను ఆదుకుంటూ, చైతన్యపరుస్తూ, మాస్క్ లు ధరింప చేస్తూ, భౌతిక దూరం పాటించడం గురించి వివరిస్తూ ముందుకు కదిలారు.

వీరిలో చాలా మందితో నాకున్న సాన్నిహిత్యంతో.. దగ్గరగా చూసిన వాడిగా ఈ స్పూర్తి గీతాన్ని నా మిత్రులు ప్రణయ్ కుమార్, ఉజ్వల్, వీడియో ఫ్రేమ్స్ సహకారంతో నిర్మించి ప్రజాప్రతినిధులకు, పోలీసుశాఖకు, డాక్టర్ లకు, ఇతర ప్రత్యేక సిబ్బందికి అంకితం చేస్తున్నాము” అన్నారు.

Related posts

బాపూజీ కలలు కన్న తెలంగాణ ఇంకా రాలేదు

Satyam NEWS

తెలంగాణా అక్రమనీటి వినియోగంపై ప్రధానికి ఫిర్యాదు

Satyam NEWS

ఎలర్ట్: అత్యవసర విభాగాలకు ప్రత్యేక పాస్ లు

Satyam NEWS

Leave a Comment