Slider ప్రపంచం

ఆస్ట్రేలియా ల్యాబ్ నుంచి మాయమైన వైరస్ వయల్స్

#limpavirus

కరోనా వైరస్ సృష్టించిన విలయం మరువక ముందే మరో వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం కనిపిస్తున్నది. తాజాగా ప్రాణాంతక సజీవ వైరస్‌ నమూనాలు ఉన్న వందలాది వయల్స్ (చిన్న బాటిల్స్) ల్యాబ్ నుంచి అదృశ్యమైనట్టు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. వయల్స్ మాయం ఘటన కలకలం రేపడంతో ఆస్ట్రేలియా ప్రజారోగ్య విభాగంతోపాటు క్వీన్స్‌లాండ్ హెల్త్ శాఖ సంయుక్తంగా దర్యాప్తునకు ఆదేశించాయి. ఈ ఘటనను అతిపెద్ద బయోసెక్యూరిటీ ప్రొటోకాల్స్ ఉల్లంఘనగా ప్రభుత్వం పేర్కొంది. గతంలో చైనా ల్యాబ్ నుంచి కరోనా వైరస్ ఇదే విధంగా బయటకు వచ్చి ప్రపంచం మొత్తం వ్యాపించింది. వివిధ రకాల సజీవ వైరస్‌ శాంపిల్స్ కలిగిన 323 వయల్స్ గతేడాది ఆగస్టులో క్వీన్స్‌లాండ్‌లోని పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబొరేటరీ నుంచి మాయమయ్యాయి. తాజాగా విషయం వెలుగులోకి రావడంతో అందరిలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాయమైన వయల్స్‌లో ప్రమాదకర హెండ్రా వైరస్, లిసావైరస్, హంటావైరస్ వంటివి ఉన్నాయి. హెండ్రా అనేది జూనోటిక్ (జంతువుల నుంచి మనుషులకు సోకేది) వైరస్. దీనిని ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో మాత్రమే గుర్తించారు. హంటావైరస్ అనేది వైరస్‌ల కుటుంబాలకు చెందినది. ఇది తీవ్రమైన అనారోగ్యానికి గురిచేయడంతోపాటు మరణానికి కూడా కారణమవుతుంది. ఇక, లిసా వైరస్ అనేది వైరస్‌ ల సమూహానికి చెందినది. ఇది సోకితే రేబిస్ వ్యాధి వస్తుంది. కనిపించకుండా పోయిన ఈ వయల్స్‌ను ఎవరైనా ఎత్తుకెళ్లారా? లేదంటే ధ్వంసమయ్యాయా? అన్న విషయంలో స్పష్టత లేదు.

Related posts

కల్తీ మద్యం తాగి ఏడుగురి మృతి

Satyam NEWS

కొత్త అప్పులు పుట్టని పాత అప్పుల ఊబి ఆంధ్రప్రదేశ్

Satyam NEWS

కారు ప్రమాద మృతురాలికి పరిహారం అందచేత

Satyam NEWS

Leave a Comment