25.2 C
Hyderabad
October 15, 2024 12: 24 PM
Slider ముఖ్యంశాలు

శంషాబాద్‌లో మరో యువతిపై అత్యాచారం హత్య

another murder

ప్రియాంక రెడ్డి హత్య జరిగి ఒక రోజు కూడా కాకముందే  శంషాబాద్ పరిధిలోనే అదే తరహాలో దారుణ ఘటన ఇంకోటి జరిగింది. 20ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య వయస్సు గల ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే సిద్దులగుట్ట రోడ్డులోని బంగారు మైసమ్మ ఆలయం పక్కన ఈ ఘటన జరిగింది. 

అత్యంత దారుణంగా ఆ యువతిని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. పూర్తిగా డెడ్ బాడీ కాలిపోయినట్లు తెలుస్తుంది. మహిళను హత్య చేసి కాల్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గోడ పక్కనే అమ్మాయి హత్య జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. గంటా రెండు గంటల క్రితమే ఘటన జరిగి ఉండవచ్చునని అంటున్నారు పోలీసులు.  అత్యాచారం చేసి చంపేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు.

ప్రియాంకను చంపి 24గంటలు గడవక ముందే అదే ప్రాంతంలో మహిళ హత్య కావడంతో ఈ హత్య సంచలనంగా మారింది. నిత్యం పూజలు జరిగే స్థలంలోనే ఈ ఘటన జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  క్లూస్ సేకరిస్తున్నారు. చట్టుపక్కల ప్రాంతాల్లో అణువు అణువు గాలిస్తున్నారు. టెంపుల్ పరిసర ప్రాంతంలోనే రోడ్ పక్కనే ఘటన జరిగింది. ప్రైమరీ ఎవిడెన్స్  సేకరించారు పోలీసులు.

Related posts

ఎన్నో ఆశలతో నన్ను గెలిపించారు:జగన్

Satyam NEWS

మూత్ర‌నాళ వ్యాధికి అధునాత‌న‌ శ‌స్త్రచికిత్స

Satyam NEWS

గుమ్మడి ప్రకాష్ జ్ఞాపకార్ధం మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్ అన్నదానం

Satyam NEWS

Leave a Comment