34.2 C
Hyderabad
April 19, 2024 20: 38 PM
Slider ఆధ్యాత్మికం

అంతర్వేది లో నేటి నుంచి దర్శనాలు ప్రారంభం

#AntarvediTemple

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాలను పునరుద్ధరించారు. ఆలయ ప్రాంగణంలో, దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అధికారులు పునఃసమీక్షించి దర్శనాలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఆలయ సహాయ కమిషనర్‌ భద్రాజీ మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో రావాలన్నారు.

ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు, వృద్ధులకు ఆలయంలో ప్రవేశం లేదని తెలిపారు. 

Related posts

మంత్రి బొత్స నివాసంలో కొత్త ఏడాది వేడుకలు..!

Satyam NEWS

దివాలాతీసిన ఏపి విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి

Satyam NEWS

ముగ్గురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్

Satyam NEWS

Leave a Comment